ఆంధ్రప్రదేశ్‌

పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పరిధిలోని లక్షా 80వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ జెఏసీ అమరావతి చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు గురువారం సచివాలయంలో ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ను కల్సి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ వర్గాలకు చెందిన అనేక అంశాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. పీపుల్స్ ఫస్ట్‌గా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 1100కి ప్రజలు ఫిర్యాదు చేసే విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే అందులో ప్రతి ఫిర్యాదుదారుని ఆధార్ నెంబర్ నమోదు చేయటం, ప్రతి ఫిర్యాదుదారునికి రసీదు నెంబర్ అందచేయుట, సర్వర్ కెపాసిటీ, వేగం పెంచుతూ ఏ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫిర్యాదులు ఆ శాఖకు మాత్రమే చేరేలాగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని కోరారు. బయోమెట్రిక్ పరికరాలు గ్రామస్థాయి వరకు అందుబాటులోకి వచ్చేవరకు నిర్బంధంగా అమలు చేయించవద్దన్నారు. పార్ట్‌టైం ఉద్యోగులు, డ్రైవర్లు, ఆఫీసు సబార్డినేట్స్, ఉన్నతాధికారుల వద్ద పనిచేసే సిబ్బందికి ఈ విధానం నుంచి మినహాయింపు నివ్వాలని కోరారు.