ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి చేస్తున్నాం... 2019లోనూ పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 7: ప్రపంచ దేశాలు, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి 2019 ఎన్నికల్లోకూడా తిరిగి పట్టం కట్టాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్న గార్బేజ్ బయో మైనింగ్ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచలోనే ఏ నేత కష్టపడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తూ పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్థికి పాటుపడుతున్నారన్నారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని విభజించిన వారు ఓడిపోయి మిన్నకున్నారని, కలెక్టర్‌కు సైతం ఆఫీస్, బంగ్లాలు ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి సదుపాయం లేని రోజుల్లో బస్సు నుంచే పాలన ప్రారంభించిన సీఎం చంద్రబాబు, సరైన నిధులు లేకున్నా పెన్షన్లు, రుణమాఫీలను అమలుచేసిన వైనం అభినందనీయమన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు పెరుగుతుండగా విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు ముందుకొస్తున్న సీఎం చంద్రబాబు ఒక్కరేనన్నారు. విజయవాడను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు దీటుగా అభివృద్ధిపర్చడమే కాకుండా ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిపర్చి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని వివరించారు. ప్రత్యేక నిధులతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో 4వేల 600 కోట్ల నిధులతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా తదితర వౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, విజయవాడ నగర సమస్యల సత్వర పరిష్కారానికి ఇన్‌చార్జ్ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొంటున్నానని పేర్కొన్న ఆయన 2019 ఎన్నికల్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ వరకూ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రజలు, కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమ, కలెక్టర్ లక్ష్మీకాంతం, వీఎంసీ కమిషనర్ జె నివాస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.