ఆంధ్రప్రదేశ్‌

సైనిక సంక్షేమానికి విరివిగా విరాళాలు ఇవ్వాలి: సీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: దేశ భద్రతకు అహర్నిశలు శ్రమించి ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకై సైనిక సంక్షేమానికి ప్రజలు, దాతలు విరాళాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గురువారం సైనిక సంక్షేమానికి ఆయన తొలి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులను, మాజీ సైనికులను, వారి కుటుంబాల గౌరవార్థం పునఃస్మరించుకుంటున్నామన్నారు. మన దేశ త్రివిధ దళాల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడానికి ఈ సాయుధ దళాల పతాక దినోత్సవం దోహదం చేస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ఈ విధంగా సాయుధ దళాల పతాక దినోత్సవం రోజు నుండి ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతల నుండి సేకరించిన విరాళాలతో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన పతాక దినోత్సవ నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విరాళాలన్ని ఆ నిధిలో జమ చేస్తారన్నారు. ఆ నిధిని త్రివిధ సైనిక దళాల మాజీ సైనికుల, మాజీ సైనికుల వితంతువులు సంక్షేమార్థం వినియోగిస్తారని సీఎస్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.