ఆంధ్రప్రదేశ్‌

క్రీడాకారులకు ఐదు శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 7: క్రీడాకారులకు విద్య, ఉద్యోగావకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మోటమర్రి హరిత మెమోరియల్ 8వ ఆంధ్రప్రదేశ్ సీనియర్స్ మహిళా అంతర్ జిల్లాల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలను గురువారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నూతన క్రీడా పాలసీని ప్రవేశపెట్టి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రూ.2కోట్లతో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు 26 నియోజకవర్గాల్లో నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మరో 60 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమైనట్లు వివరించారు. 89 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మండల కేంద్రాల్లో కూడా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3వేల పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు అకాడమీలను త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో నాలుగు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. తొలి విడతగా రూ.13కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ క్రీడలకు పేరొందిన మచిలీపట్నంలో ఎన్నో జాతీయ పోటీలు నిర్వహించామన్నారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ హాకీలో మచిలీపట్నానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఏపీ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం నిరంజన్‌రెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ అసోసియేటెడ్ అధ్యక్షుడు చలమలశెట్టి నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.