ఆంధ్రప్రదేశ్‌

కొరియా పర్యటన విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: దక్షిణ కొరియాలో మూడు రోజుల పర్యటన విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి అనుకూల వాతావరణం కల్పించగలిగామన్నారు. కొరియా అభివృద్ధి తనను ముగ్ధుడిని చేసిందన్నారు. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి ఆయన విజయవాడ చేరుకున్న ఆయన గురువారం సీఎంవోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన పర్యటన విశేషాలు వెల్లడించారు. కియా మోటార్సు అనుబంధ సంస్థలు దాదాపు 5 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జన్మభూమి తరహా కార్యక్రమం అక్కడ కూడా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర జీడీపీ 50 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా, కొరియా జీడీపీ 1.44 ట్రిలియన్ డాలర్లన్నారు. రాష్ట్రం కన్నా 15 రెట్టు ఎక్కువగా ఉందన్నారు. కియా మోటార్సు రావడంతో ఆటోమొబైల్ అనుకూల వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పగలిగామన్నారు. వివిధ కారణాల వల్ల విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు రాలేదన్నారు. కియా మోటార్సు 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. తమిళనాడులో వివిధ కారణాల వల్ల ఏర్పాటు చేయని మరో 37 కంపెనీలు కూడా దాదాపు 3000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయన్నారు. అనంతపురంలో దక్షిణ కొరియా టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్గించామన్నారు. కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులు కొరియా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ప్రచారం కల్పిస్తున్నారన్నారు. పెట్టుబడుల విస్తరణకు ఏపీ సరైన స్థానంగా గుర్తించామని కియా సంస్థ ప్రెసిడెంట్ పార్క్ చెప్పడం తనకు ఎంతో అనందాన్ని ఇచ్చిందన్నారు. బూసన్ పోర్టుతో కృష్ణపట్నం అనుసంధానం చేసేందుకు వీలు ఉందన్నారు. సౌర విద్యుత్ స్టోరేజీకి సంబంధించి దృష్టి సారించాలని ఎల్‌జీ సంస్థను కోరినట్లు తెలిపారు. కోకమ్ గ్రూపు లిథియం బ్యాటరీ తయారీలో అగ్రగామిగా ఉందన్నారు. జీవితకాలం పని చేసే బ్యాటరీల తయారీపై పరిశోధనలు చేస్తోందన్నారు. ఆ బ్యాటరీ ఆవిష్కరణ జరిగితే అతిపెద్ద మలుపు అవుతుందన్నారు. అమరావతి క్రీడానగరంలో పాలుపంచుకోవాలని జీఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని కోరామన్నారు. దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ అనంతపురంలో ఏర్పాటు చేయాలని బీటీఎస్ కంపెనీకి ప్రతిపాదించగా, సానుకూలంగా స్పందించారన్నారు. దక్షిణ కొరియా, ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనున్నారన్నారు. గ్రీన్ క్రాస్ సెల్ సంస్థతో క్యాన్సర్ చికిత్సకు ఔషధాలు తయారు చేసేందుకు భాగస్వాములు అవుతామని, ఏపీకి రావాలని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సెకండ్ హోమ్‌గా చేసుకోవాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరామన్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా మార్చాలన్న ప్రయత్నంలో భాగమే కొరియన్ సిటీ ఆలోచన అని తెలిపారు. వివిధ దేశాలు అమరావతిలో పెట్టుబడులు పెడితే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేందుకు వీలుగా కొరియాలో ఇద్దరు అధికారులను ఫెసిలిటేటర్లుగా నియమించేందుకు నిర్ణయించామన్నారు. ఇంకా వారి హోదాలు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అక్కడ ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. విద్యార్థులతో సాంస్కతిక ఎక్సేంజ్ కార్యక్రమం నిర్వహించడం వల్ల మన సంస్కృతి కొరియన్లకు, వారికి మన సంస్కృతి తెలుస్తుందన్నారు.