ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు ప్రజలంతా సహకారం అందించాలని విశ్వయోగి విశ్వంజీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, బుధవారం మహాసంకల్ప దీక్ష తీసుకుంటున్న సందర్భంగా, రాష్ట్ర పాలకులు, ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నప్పటికీ, అభివృద్ధి పథంలో నడుస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్ల రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో ముందుకు వెళుతుందని, ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందుతాయన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా నిలవాలని సూచించారు. కొత్త రాజధాని అమరావతి అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని, దీని నిర్మాణలో అన్నిప్రాంతాల్లోని తెలుగు ప్రజలంతా భాగస్వామలు కావాలని విశ్వంజీ పిలుపు ఇచ్చారు.