ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనులు పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 8: జాతీయ జల విద్యుత్ సం స్థ అధికార్ల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తాల్లో శుక్రవారం పర్యటించింది. ఢిల్లీ నుండి వచ్చిన బృందం సభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి తొలుత ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం డయా ఫ్రం వాల్, స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఇఎన్‌సి ఎంవెంకటేశ్వరరావు, సిఇ రమేష్‌బాబు నిర్మాణ పనులను వారికి వివరించారు. అనంతరం ఆర్‌ఆర్ ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. వైకే ఛేబి, ఆర్సీ శర్మ, శంకర్‌దీప్ సేథీ బృందంలో ఉన్నారు. ఈసందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తంచేశారన్నారు. ఈ బృందం నివేదికపై ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి అనుమతులు వస్తాయని మంత్రి తెలిపారు.

చిత్రం..స్పిల్ వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు, మంత్రి దేవినేని