ఆంధ్రప్రదేశ్‌

కాంట్రాక్ట్ పొడిగింపులో 15 మాసాలుగా నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో కొనే్నళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు శుక్రవారం విజయవాడలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మొర పెట్టుకున్నారు. ఈ సెంటర్‌లో ప్లానింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి సంజయ్‌గుప్తా ప్రాంతీయతత్వంతో 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్ట్‌ను పొడిగించకుండా గత 15 మాసాలుగా తమను రోడ్డుపై నిలిపారంటూ బాధిత ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 1989లో నాటి సీఎం ఎన్టీఆర్‌చే ప్రారంభమైన స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత స్పేస్ అప్లికేషన్ సెంటర్‌గా మార్పు చెందినదన్నారు. పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థకు ప్లానింగ్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సంస్థను తన రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుందాం రండంటూ 15 మాసాల క్రితం కార్యాలయాన్ని విజయవాడకు తరలించి తమ కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయకుండా తమను రోడ్డున పడవేశారని ఆరోపించారు. గతంలో తమకు రూ.30వేల లోపు జీతాలుంటే తమ స్థానంలో ఉత్తరాది ప్రాంతం నుంచి తీసుకువచ్చినవారికి రూ.80వేలు వరకు జీతాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తమను రెన్యువల్ చేయాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్, ఇతర ప్రజాప్రతినిధులు ఆదేశించినా కూడా బేఖాతరు చేస్తున్నారని అన్నారు. అలా ఎందుకు జరుగుతుందో విచారించాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ ప్రాంతీయ తత్వం కారణమైతే దీనిపై తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని హామీనిచ్చారు.
అదే విధంగా వివిధ సమస్యలపై ఆయనను పలు సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు కలిసి విన్నవించుకున్నారు.
* ఫాతిమా విద్యార్ధులకు భరోసా
విద్యార్ధులందరూ కళాశాలలకు వెళ్ళే వరకు నేను తోడుగా ఉంటా. రాష్ట్ర ప్రభుత్వం ఆరినెన్స్ జారీ చేసి విద్యార్ధులకు న్యాయం చేయాలి.
* విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో..
శ్రమ దోపిడికి నేను వ్యతిరేకం. విద్యుత్ కార్మికుల సమస్యలపై ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడతా. సమ్మెకు జనసేన మద్దతు
* కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై
మీ కోరికలు న్యాయమైనవి. ఆడపిల్లల కన్నీటి శోకాలు రాష్ట్రానికి మంచిది కాదు. రెగ్యులరైజ్ చేయంచేందుకు ఒత్తిడి తెస్తా
* ఏపీసీపీఎస్ ఉద్యోగులతో
సీపీఎస్ విధానం రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమస్య. నిపుణులతో మాట్లాడి సమస్యకు పరిష్కార మార్గం అనే్వషిస్తా. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏం చేసింది.
పార్టీ కార్యాలయ స్థలం పరిశీలన
మంగళగిరి, డిసెంబర్ 8: గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి అద్దె ప్రాతిపదికన తీసుకున్న 3.42 ఎకరాల స్థలాన్ని శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తొలుత అనంతపురంలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ రాజధానిలో పెద్ద ఆఫీసు ఉండాలని భావించి ఈ స్థలాన్ని తీసుకున్నామన్నారు. స్థలాన్ని ఇచ్చిన యార్లగడ్డ కుటుంబీకులు వెంకటేశ్వరరావు, సాంబశివరావు, శ్రీలక్ష్మిలను సత్కరించారు. వీరి సోదరుడు అంకినీడు ప్రసాద్‌ను కూడా సత్కరించేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.