ఆంధ్రప్రదేశ్‌

పీఆర్‌టీయులో ఎలాంటి చీలికలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: తప్పుడు ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాల నేపథ్యంలో అధ్యక్షుడు మత్తి కమలాకరరావును సంఘం నుంచి తొలగించటం మినహాయించి సంఘంలో ఎలాంటి చీలికలు లేవని, 13 జిల్లాల పీఆర్‌టీయు అధ్యక్షులు, కార్యదర్శులందరూ ఏకతాటిపై ఉన్నారని పీఆర్‌టీయు ఎమ్మెల్సీ ఫ్రంట్ ఫ్లోర్‌లీడర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయు) రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమంతా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1998, 2008, 2012 డీఎస్సీల్లో వున్న సమస్యలను పరిష్కరించటానికి, ప్రాథమిక విద్య నుండి యూనివర్శిటీ విద్య వరకు పెండింగ్‌లో వున్న వివిధ సమస్యలను త్వరితగతిలో పరిష్కరించటానికి ఎమ్మెల్సీలు, అధికారులతో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిందని, దీని ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.