ఆంధ్రప్రదేశ్‌

జగన్‌తో ఆస్తులు ప్రకటింపజేసే సత్తా ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ప్రజా జీవితంలో ఉండే నాయకులు పారదర్శక పాలనలో భాగంగా వారి ఆస్తులు ప్రకటించాలని దేశంలోని మేధావులందరూ పదే పదే కోరుతున్నారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య శుక్రవారం అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం గత ఏడేళ్లుగా పార్టీ అగ్రనేత ఆస్తులే కాక కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటిస్తున్నారంటూ శుక్రవారం ఒక ప్రకటనలో వర్ల పేర్కొన్నారు. ఏటా కుటుంబ ఆస్తులు ప్రకటించే తెలుగుదేశం పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు ఎవరూ హర్షించరని అన్నారు. దేశంలోనే అతి పెద్ద అవినీతిపరుడికి కాపలా కాస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి చేతనైతే, చావ ఉంటే తమ అధినేత జగన్ కుటుంబ ఆస్తులను బహిరంగపరిచేందుకు ప్రయత్నం చేయాలంటూ, అసలు ఆ ప్రయత్నం చేసే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు. జగన్ ఆస్తులు జగన్ కాకుండా అవినీతి నిరోధక సంస్థ ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ప్రకటిస్తే తెలుసుకునే పరిస్థితి ఉందన్నారు.