ఆంధ్రప్రదేశ్‌

రుణాలు ఇవ్వని బ్యాంకర్లకు వారెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 9: కార్పొరేషన్ రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సిద్ధంగా ఉందని కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. శనివారం కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కోసం కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కొంత మంది బ్యాంకర్లు రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులను ఇబ్బందులను పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకర్లకు వారెంట్ జారీ చేస్తామన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో కమిషన్ సమావేశమై తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందన్నారు. దళిత, గిరిజనులను వేధింపులకు గురిచేసే వారిపై కఠినమైన చట్టాలను ప్రయోగించి వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం నిబంధనలు అతిక్రమించినా సంబంధిత శాఖాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శివాజీ హెచ్చరించారు.