రాష్ట్రీయం

కృష్ణాడెల్టాకు నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూన్ 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు బుధవారం నాడు సాగర్ డ్యాం అధికారులు నీటిని విడుదల చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు 3,500క్యూసెక్కులను ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం 7వేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 506.50అడుగుల నీటిమట్టం ఉంది. కృష్ణా నది నీటి వినియోగంలో నీటిపంపకాలలో ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపధ్యంలో కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు కృష్ణాడెల్టాకు నీటివిడుదల చేయడం వివాదస్పదం కానుంది. ఈసందర్భంగా డ్యాం ఎస్‌ఇ రమేశ్ మాట్లాడుతూ కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు 7వేల క్యూసెక్కులను కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నామని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ డిమాండ్‌ను బట్టీ జెన్‌కో అధికారులు ఆ నీటిని వినియోగించుకుంటూ డెల్టాకు వదిలిపెడ్తున్నట్లు తెలిపారు.