ఆంధ్రప్రదేశ్‌

విదేశీ విద్యాసంస్థల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 9: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులు అప్రమత్తతంగా వ్యవహరించాలని ఐటిశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. చేరబోయే విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలను ఇంటర్‌నెట్ ద్వారా సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. గురువారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే విద్యార్థులు ముందుగా అక్కడి పద్ధతులు, వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎంపిక చేసుకున్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలన్నారు. ఏజెన్సీల ద్వారా విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేవారు అక్కడి విద్యాసంస్థలకు గుర్తింపు లేదని తెలుసుకుని అవస్థలు పడుతున్నారన్నారు. కాబట్టి ఏజెన్సీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అక్కడ చేయబోయే కోర్సులు, విద్యాసంస్థలు, ఏజెన్సీల సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో విచారణ జరిపి వాటికి గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కెంటకి నుంచి 22 మంది తెలుగు విద్యార్థులను డిస్‌క్వాలిఫై చేసి వెనక్కు పంపారన్నారు. కనుక విదేశాలకు వెళ్లే విద్యార్థులు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డిగ్రీ సర్ట్ఫికెట్లు, వీసా, పాస్‌పోర్టు ఒరిజినల్‌వి వెంట ఉంచుకోవాలన్నారు. అమెరికా వెళ్లే విద్యార్థులు అమెరికన్ వీసా కార్యాలయంలో సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కొంత శిక్షణ పొందాల్సి ఉందని మంత్రి సూచించారు. ఎపిఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి కోమటి జయరాం ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్ర వ్యాప్తంగా 400 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10వ తరగతి వరకు) డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. అలాగే 7 వేల అంగన్‌వాడీ స్కూల్స్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ వాటాగా రూ.7 లక్షలు, ఎన్‌ఐఆర్‌ల వాటాగా రూ.3 లక్షలు చెల్లించేందుకు తోడ్పాటునివ్వనున్నారన్నారు. స్మార్ట్ విలేజెస్‌లో కూడా అనేకమంది దాతలుగా ఉన్నారన్నారు. భారతీయ సంస్కృతి, తెలుగు భాషను ప్రతిబింభిస్తూ వివిధ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు తెలుగు స్కూల్స్ ఏర్పాటు చేశారని, కూచిపూడి నృత్యం, పండుగలు పర్వదినాలు జరుపుకుంటున్నారన్నారు.