ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలొస్తేనే మైనార్టీలు గుర్తుకొస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 11: ఎన్నికలు వస్తేనే బాబుకు మైనార్టీలు, వారి సమస్యలు గుర్తుకొస్తాయని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 32వ రోజు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఒడ్డుపల్లిలో నిర్వహించిన మైనారిటీలతో ముఖాముఖిలో జగన్ మాట్లాడుతూ మైనారిటీలంటే బాబుకు చిన్నచూపని అన్నారు. అందుకే విభజన తరువాత ఏర్పడిన కొత్త రాష్ట్రంలో ఒక్క మైనారిటీ మంత్రిని కూడా చేర్చుకోలేదన్నారు. గత 60 ఏళ్ళలో ఇలాంటి పరిస్థితిని మనం చూడలేదన్నారు. మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దగా చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల ముందు ప్రతి కులానికి, మతానికి మేనిఫెస్టోలో స్థానం కేటాయించారని కానీ వాటిని అమలు చేయలేదన్నారు. రంగనాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు 10 శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందని జగన్ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మైనారిటీలకు రు.2500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని ఇచ్చిన హామీ అమలుచేయలేకపోయారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించి వారి మనసులో చోటు సంపాదించారన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటించారన్నారు. కానీ నేడు దాన్ని బాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కేవలం 30 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తుండడంతో చాలా మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. మీరంతా ఆదరించి వైసీపీకి అధికారం కట్టబెడితే ఇమాంలకు రూ..10 వేలు, వౌల్వీలకు రు.5వేలు ప్రతి నెలా ఇస్తామన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి రు.2 వేలు ఫించన్ అందిస్తామన్నారు. వృద్దుల ఫించన్ రెండింతలు చేస్తానని, పాఠశాలకు వెళ్లే పిల్లల ఖర్చుల కోసం ఏటా రు.15 వేలు, కళాశాలకు వెళ్ళేవారికి రూ. 20 వేలు చెల్లిస్తానని తెలిపారు. వైద్యానికి రూ..వేయిపైన ఖర్చయిన వారందరికీ ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలోనే గాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడులోని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు నదీం అహ్మద్, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ కవిత, తోపుదుర్తి భాస్కరరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లిలో జరిగిన మైనారిటీలతో ముఖాముఖిలో ప్రసంగిస్తున్న జగన్