ఆంధ్రప్రదేశ్‌

‘ఆ ఇళ్లు ఖాళీ చేయించవద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా తులగామ గ్రామంలో 115 మంది గ్రామస్తుల ఇళ్లు శుక్రవారం వరకూ ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన బెంచ్ రామకృష్ణారావు తదితరులు దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించి ఈ ఆదేశాలు ఇచ్చారు. వంశధార నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ సరికాదని గ్రామస్తులు సవాలు చేయగా, గతంలో ఏక సభ్య బెంచ్ ప్రభుత్వ చర్యను సమర్ధించడంతో గ్రామస్తులు హైకోర్టు బెంచ్ ముందు సవాల్ చేశారు. ప్రకటన చేసిన ఐదేళ్లలో భూమిని స్వాధీనం చేసుకోలేదు కనుక అపుడు ఇచ్చిన భూ సేకరణ ఇపుడు చెల్లదని పిటీషనర్ల తరఫున న్యాయవాది వసుద నాగరాజు పేర్కొన్నారు.