ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం దయ కాదు..రాష్ట్రం హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టు కేంద్రం దయ కాదని, రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా పూర్తిచేయాల్సి ఉందని అఖిల పక్షం నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విశ్వసనీయత కోల్పోవడం వల్లే పోలవరానికి ఈ దుర్గతి పట్టిందన్నారు. కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఎందుకు రాష్ట్రం నెత్తినేసుకుందని నిలదీశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకం కానుందా అనే అంశంపై వైసిపి రైతు విభాగం ఆధ్వర్యంలో సోమవారం అఖిలపక్ష చర్చావేదిక నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఎంపీలు ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి అఖిలపక్షాన్ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ వద్దకు తీసుకెళ్లాలన్నారు. లేదంటే బీజేపీ నేతృత్వంలోనైనా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు.
ప్రాజెక్టు పనులకు సంబంధించి కొత్తగా పిలిచిన టెండర్ల వివరాలు నెట్‌లో ఒక విధంగా, పేపర్‌లో మరోవిధంగా ఉండటంతో కేంద్రానికి అనుమానం వచ్చిందన్నారు. శే్వతపత్రం విడుదల చేయాలంటే అభివృద్ధి నిరోధకులు అని ముద్రవేయడం సరికాదన్నారు. నాణ్యత గురించి ప్రశ్నిస్తుంటే మారీచుడు, సుబాహువుగా చూస్తే ఎలాఅని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ప్రాజెక్టులోనూ కాఫర్ డ్యాం నుంచి నీరివ్వలేదని, పోలవరం ప్రాజెక్టు నుండి ఇస్తామని అనడం వింతగా ఉందన్నారు. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు వీలుగా అడ్డుకట్టగా కాఫర్ డ్యాం నిర్మిస్తారన్నారు. అయితే 41 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యాం మట్టికట్ట కడితే ప్రవాహ ఉద్ధృతిని తట్టుకుంటుందా అని ప్రశ్నించారు. 60సి కింద ప్రధాన కాంట్రాక్టు నుంచి పనులను తప్పించడానికి మూడేళ్లుపడితే, ఇక ప్రాజెక్టు ఎనే్నళ్లలో కడతారో అనే అనుమానం కలగకమానదన్నారు. ఇప్పటికొచ్చి సబ్-కాంట్రాక్టర్లు చేసే పనులకు సంబంధించిన చెల్లింపులు వారికే వెళ్ళేలా ప్రత్యేక అకౌంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. జలవనరుల శాఖ మాజీ ఎస్‌ఇ సానా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరానికి ఎంత ఖర్చయినా కేంద్రం చెల్లించాల్సివుందన్నారు. రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రధాన డ్యాం, కాఫర్ డ్యాం ఒకేసారి నిర్మించడం కుదరదని, స్పిల్ వే, స్పిల్ ఛానల్ ముందు నిర్మించాల్సి ఉందన్నారు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడుతూ పోలవరం నిర్మాణంపై ఎదురవుతున్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సత్వరం నిర్మించాలని కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అఖిలపక్షం ఎంపిలు, నేతలను తీసుకెళ్ళాలని, ఒకవేళ ఆయన తీసుకెళ్ళకపోతే బీజేపీ నేతృత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తీర్మానించింది. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బీజేపీ నుంచి అడబాల రామకృష్ణ, సీపీఐ నుంచి నల్లా రామారావు, సీపీఎం నుంచి మూర్తి, , వైసీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి, న్యాయవాదుల సంఘం ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు మాట్లాడారు.
చిత్రం..అఖిలపక్ష చర్చావేదికలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్