ఆంధ్రప్రదేశ్‌

పల్లెలకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: గ్రామాల సమగ్రాభివృద్ధి, స్వయం సమృద్ధే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్ కార్డులు కొత్తగా ఎంతమందికి అందివ్వాలన్నది త్వరలోనే నిర్ణయించి తెలియజేస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన బిజినెస్ రూల్స్ మార్పు కోసం వెంటనే ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘వృద్ధి వ్యూహాలపై మంగళవారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ల సదస్సుకు ముందస్తు సన్నాహకంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలనే సాధించినా నిర్దేశిత లక్ష్యసాదనలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి.. మరింత వృద్ధిరేటు సాధించేందుకు ఏం చేయాలన్న అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15.64 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. గత ఏడాది రాష్ట్రం 11.18 ఆర్థిక వృద్ధిరేటు సాధించగా, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధింపు వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ్భాగం ముగింపు నాటికి 11.37 శాతం వృద్ధి సాధించడం విశేషమేనన్నారు. మిగిలిన ఆరు మాసాల కాలానికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి అధికారి రోజూ 8 గంటలు దృష్టి పెట్టి పనిచేస్తే అది అసాధ్యమేమీ కాదని అన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశాలు ఉష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 2017-18 తొలి అర్ధ సంవత్సరం ముగింపు నాటికి వృద్ధి రేటు 25.60 శాతంగా ఉంటే, అనుబంధ రంగాల్లో 2017-18 తొలి అర్ధ సంవత్సరం ముగింపు నాటికి వృద్ధి రేటు 25.60 శాతం, పారిశ్రామిక రంగంలో 7.43 శాతం, సేవా రంగంలో 8.38 శాతం చొప్పున ఉందని అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మూడు రంగాల్లో కలిపి వృద్ధిరేటు ఈ ఏడాది ఇప్పటికి 11.37 శాతం వచ్చిందని చెప్పారు. అఖిల భారత స్థాయిలో ఇది 5.8 శాతంగా ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయంలో 17.44 శాతం, ఉద్యాన రంగంలో 18.62 శాతం, పశు సంవర్ధకంలో 13.68 శాతం వృద్ధిరేటు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మత్స్యశాఖలో అత్యధికంగా 42.73 శాతం వృద్ధిరేటు నమోదైందని వివరించారు. పారిశ్రామిక రంగానికి వస్తే గనుల్లో 8.02 శాతం, తయారీ రంగంలో 8.36 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాలో 9.23 శాతం, నిర్మాణ రంగంలో 5.49 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. సేవా రంగం విషయానికి వస్తే ట్రేడ్, రిపేర్లు, హోటల్, రెస్టారెంట్లు కలిపి 8.56 శాతం, రైల్వేలలో 2.20 శాతం, రవాణా, గిడ్డంగుల్లో 7.88 శాతం, కమ్యూనికేషన్ల రంగంలో 8.06 శాతం, ఆర్థిక సేవల్లో 8.27 శాతం, రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణాల్లో 8.89శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 6.72 శాతం, ఇతర సేవా రంగాల్లో 9.59 శాతం వృద్ధి కనబరచినట్టు చెప్పారు. ప్రతి త్రైమాసికం తనకొక పరీక్ష అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జీవీఏ లక్ష్యం రూ.29.226 కోట్లుగా ఉంటే, దానికి మించి రూ.29385 కోట్ల మేర లక్ష్యాన్ని సాధించామని ప్రణాళికాశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే కాలానికి పారిశ్రామిక రంగంలో రూ.33,329 కోట్లు, సేవా రంగంలో రూ.64,770 కోట్లు జీవీఏ సాధించినట్టు తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసి 2019 నాటికి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనుల ప్రగతిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ బాగా కష్టపడ్డారని ప్రశంసించారు.
రాయలసీమలో కరువు, ఆంధ్ర ప్రాంతంలో తుఫాన్లు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో గట్టి సవాళ్లుగా నిలిచాయని, ఆ తరువాత జల సంరక్షణ కార్యక్రమాన్ని గొప్ప ప్రజా ఉద్యమంగా మలచి సేద్యపు నీటిపారుదల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సౌత్ కొరియాలో ప్రతి పరిశ్రమ అంతర్జాతీయ పరిశ్రమగా గుర్తింపు పొందిందని, మన సంస్థలు ఆ స్థాయికి ఎదగాలని చెప్పారు. పర్యాటక రంగంలో మెరుపు వేగంతో పనిచేస్తే ఫలితాలు సాధించగలుగుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గేమింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా అనేకమందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ చెప్పారు. ఈ రంగంలో ప్రాజెక్టు నెలకొల్పడానికి సుప్రసిద్ధ బాలివుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ ఆసక్తి చూపారంటూ, ఇలా వినూత్న ప్రాజెక్టులతో ముందుకొచ్చే వారికి అమరావతిలోని ఎంటర్‌టైన్‌మెంట్ సిటీలో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్టప్రతిని ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 27న ప్రారంభించేందుకు నిర్ణయించామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించానని చెప్పారు.

చిత్రం..మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు