ఆంధ్రప్రదేశ్‌

బాబు, గడ్కరీ మధ్య పర్సంటేజీల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) డిసెంబర్ 12: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం చంద్రబాబుకు, కేంద్ర మంతి నితిన్ గడ్కరికి పర్సంటేజీల పంపకంలో తేడాలు రావటం వల్లే పోలవరం పంచాయితీ నడుస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని ఉన్నప్పటికీ, చంద్రబాబు కమీషన్ల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతను తీసుకున్నారని విమర్శించారు. సీఎం కుర్చీకోసం ఆరాటపడుతూ జగన్ పాదయాత్ర చేస్తున్నాడని, వెంటనే జగన్ పాదయాత్ర ఆపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్డి, కమ్మ రెండు సామాజిక వర్గాలు తప్ప, జనాభాలో 50 శాతం వున్న బీసీలు, 20 శాతం వున్న దళితులకు రాజ్యాధికారం అప్పగించటం లేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలో బీసీ, దళితులు, క్రిష్టియన్లు, మైనార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. రెండున్నర ఎకరాలు వున్న చంద్రబాబుకి నేడు వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించారు. డబ్బు ఎక్కడ వుందో అక్కడ చంద్రబాబు వాలిపోతారని, అందుకే పోలవరం, అమరావతి రాజధాని చుట్టూ చంద్రబాబు తిరుగుతున్నాడని అన్నారు. అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించి చంద్రబాబు, మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని టీడీపీ, బీజేపీ తాకట్టు పెట్టాయని మండి పడ్టారు. కాపులను మోసం చేసేందుకే చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, రాజ్యాంగ ధర్మాసనం ముందు కాపు రిజర్వేషన్ నిలబడదని అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 130 వరకు సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.