ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి నాది పూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంట్రాక్టర్‌ను మారిస్తే పని కాదు సాంకేతిక ఇబ్బందులు కొనితెచ్చుకోలేం
గడువిచ్చి, పనులు పూర్తి చేయిద్దాం చంద్రబాబుకు నచ్చచెప్పిన నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారు. బుధవారం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీతో పోలవరం ప్రాజెక్టే ప్రధాన అజెండాగా దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆగమేఘాల మీద శ్రమశక్తి భవన్‌కు చేరుకున్న చంద్రబాబు, నితిన్ గడ్కరీతో పొద్దుపోయే వరకూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ప్రతిపాదనలను కేంద్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండటంతో, కొంతకాలంగా పోలవరం వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. దీనికితోడు పోలవరం ప్రధాన కాంట్రాక్టర్‌ను మార్చే ప్రసక్తే లేదంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెగేసి చెబుతుండటంతో, రాష్ట్రానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదిలావుంటే, ఈనెల 22న పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన తరువాతే, కేంద్రం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తుందని నితిన్ గడ్కరీ ప్రకటించారు. 22న గడ్కరీ పోలవరం రావాల్సివున్న తరుణంలో, అంతకుముందే చంద్రబాబు ఢిల్లీలో గడ్కరీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట చంద్రబాబు ఒక్కరే గడ్కరీతో గంటపాటు ముఖాముఖి చర్చలు జరిపారు. తరువాత రాష్ట్ర జల వనరుల మంత్రి ఉమామహేశ్వరరావు, ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి చర్చల పరంపర కొనసాగించారు. కాపర్ డ్యాం నిర్మాణం, కాంట్రాక్టరును మార్చే వివాదం, ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, ప్రాజెక్టు అంచనాల సవరణ తదితర అత్యంత ముఖ్యమైన అంశాలపై సుధీర్ఘంగా చర్చలు సాగించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్, అంచనాలను మార్చేందుకు కేంద్రం తిరస్కరిస్తుండటం తెలిసిందే. ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను ఇప్పుడు మారిస్తే సమస్యలు ఎదురవుతాయని కేంద్రం వాదిస్తోంది. దీనికితోడు ప్రాజెక్టు అంచనాలను పెంచేందుకూ గడ్కరీ అంగీకరించటం లేదు. కాపర్ డ్యాం విషయంలోనూ గడ్కరీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలవరం వ్యవహారంపై గడ్కరీ, చంద్రబాబు భేటీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంట్రాక్టర్‌ను మార్చలేం
ప్రస్తుతం పోలవరం ప్రధాన కాంట్రాక్టర్‌ను మార్చే ప్రసక్తి లేదని చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే, ప్రస్తుత కాంట్రాక్టర్‌కు నెలరోజులు గడువిస్తున్నామని, 13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ టార్గెట్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో కాంట్రాక్టర్ పనితీరును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2019నాటికి పూర్తి చేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉందని, చంద్రబాబు సైతం ఇదే పట్టుదలతో ఉన్నారన్నారు. ప్రజలకిచ్చిన హామీమేరకు లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నారు. సివిల్ ఇంజనీరింగ్ పనులను 2019నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గడ్కరీ చెబుతూ, కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో తాను హామీ ఇస్తున్నానన్నారు. కాంట్రాక్టర్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయాలని కోరామన్నారు. పునరావాస ప్యాకేజీపై త్వరలోనే నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరామని అంటూ, తానూ విదర్భ రైతునేనని, రైతు సమస్యలు తనకూ తెలుసన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి రైతులకు మేలు జరిగేలా చూసే విషయంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.