ఆంధ్రప్రదేశ్‌

భారత క్రికెట్‌కు 2018 కీలకం: ఎంఎస్‌కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: భారత్ క్రికెట్ జట్టుకు 2018 నిజమైన చాలెంజ్ అని భారత్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయానికి ఆయన తన వ్యక్తిగత పనుల నిమత్తం బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. 2018లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో పూర్తి సిరీస్‌లను ఆడనున్నామన్నారు. ఈ మూడు సిరీస్‌ల్లో రాణిస్తే, వచ్చే 5 సంవత్సరాల్లో భారత్‌కు ఢోకా ఉండదన్నారు. 2019 ప్రపంచకప్‌కు ఇంకా 18 నెలల సమయం ఉందని, సంవత్సరం ముందు నుంచి ప్రిపరేషన్ మొదలవుతుందన్నారు. 2018లో జరిగే సిరీస్‌లు కీలకమని, అయితే భారత్ 2019 ప్రపంచ కప్‌ను గెలుస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. టెస్టు, టి-20, వన్‌డే ఫార్మాట్‌ల్లో భారత్ జట్టు నెంబర్ వన్‌గా ఉందన్నారు. అటువంటి జట్టును ఎంపిక చేయడంపై తనకు సంతోషంగా ఉందని, ఆ జట్టు నెంబర్ వన్‌గా ఉండటం కన్నా ఆనందం ఏమి ఉంటుందన్నారు. క్రికెటర్లు వ్యక్తిగతంగా కూడా బాగా రాణిస్తున్నారన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర అంశాల్లో జట్టులో సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయినప్పుడు తాను బాధ పడలేదని, బాధ పడితే దాని ప్రభావం ఏలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. మ్యాచ్‌ల్లో ఎప్పుడూ మనమే గెలవాలని అనుకోవడం కూడా సరికాదన్నారు. ప్రత్యర్థులు కూడా ప్రపంచకప్ గెలిచారని గుర్తు చేశారు. వారు ప్రస్తుతం పరిణామ దశలో ఉన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ సిరీస్ తరువాత ప్రపంచ కప్ జట్టు కూర్పుపై దృష్టి సారిస్తామన్నారు. . క్రికెటర్ల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా వివిధ ఫార్మాట్‌లకు ఎంపిక చేస్తామన్నారు. షార్ట్ ఫార్మాట్‌లో బుమ్రా రాణించడంతో ప్రమోషన్ ఇచ్చి, దక్షిణాఫ్రికా టూర్‌లో స్థానం కల్పించామన్నారు. భువనేశ్వరకుమార్, బుమ్రాలపై ఉన్న వర్కులోడ్‌ను పర్యవేక్షించాల్సి ఉందని, 2019 ప్రపంచ కప్ నాటికి సమపాళ్లలో వారిని ఫిట్‌గా ఉంచాల్సి ఉందన్నారు.