ఆంధ్రప్రదేశ్‌

సామాజిక బాధ్యతతో స్పందిస్తే అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: సమాజం వల్ల లబ్ధి పొందుతున్న సంస్థలు సమాజం రుణం తీర్చుకోవాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యతను ప్రతి సంస్థా నిర్వర్తిస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సమాజం స్పందిస్తే తమకు మంచి ఆలోచనలున్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు భద్రత, స్థానిక ప్రభుత్వాలకే స్థానిక వనరులపై అధికారం అనే అంశాలపై లోక్‌సత్తా-ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం రాష్ట్రంలో చేపట్టిన అధ్యయన ఫలితాలను వివరించడానికి గురువారం లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలోని బృందం సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు సాధించామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయంతో గ్రామాల్లో 16వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించామని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, గ్రామాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచేందుకు లోక్‌సత్తా బృందం విలువైన సూచనలను చేసిందని అన్నారు. అన్నింటినీ ప్రభుత్వమే చేయడమంటే ఉన్న ఇబ్బందులు తెలిసినవేనన్నారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేయాలన్న జయప్రకాష్ నారాయణ సూచనకు స్పందిస్తూ రైతాంగం ఆదాయం పెంచేందుకు ఇప్పటికే 15 ఫుడ్ పార్కులు ఏర్పాటుచేయడానికి నిర్ణయించామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర సహాయం లభించకున్నా, ఈ ఫుడ్ పార్కుల ఏర్పాటును నిలిపివేయబోమన్నారు. విదేశాల నుంచి విచక్షణా రహితంగా పప్పు్ధన్యాలు, వంట నూనెలు దిగుమతి అవుతున్నాయని, దిగుమతులకు అడ్డుకట్టవేసేందుకు ఎన్డీయే భాగస్వామిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును జయప్రకాష్ నారాయణ కోరారు.
గత ఏడాది క్వింటా ఒక్కింటికి రూ.16,000 ఉన్న మినుములు యధేచ్ఛగా సాగిన దిగుమతుల వల్ల రూ.4వేలకు పడిపోయిందని జేపీ చెప్పారు. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై 40శాతం పన్ను విధించి, ఆ పన్నులను కేంద్రానికి ఇవ్వకుండా నేరుగా రైతాంగానికి బోనస్‌గా ఇవ్వాలని ఆయన సూచించగా, పరిశీలిస్తామని సీఎం అన్నారు. ఈ పద్ధతిలో వెళితే పంటకు రేటు నిలబడుతుందని, దిగుమతుల అవసరం ఉండదని, బోనస్ ఉండటంతో దిగుబడి పెరుగుతుందని వివరించారు.
చిన్న చిన్న నేరాలు చేసేనాడే శిక్షపడేలా చేస్తే నేరాలు తగ్గుతాయని, మహిళల భద్రతకు ఉన్న చట్టాలను పట్టణాల్లో పకడ్బందీగా అమలుచేయాలని కోరారు. ఫెర్టిలైజర్ సబ్సిడీ వల్ల అవసరం లేకున్నా ఎరువుల కొనుగోలు జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి వైద్య కేంద్రాల ఏర్పాటును వివరించారు. ప్రభుత్వం విద్యపై చాలా వ్యయం చేస్తోందని, కానీ ఫలితాలు ఆశాజనకంగా లేవని జేపీ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. బట్టీపట్టే విధానం తీసివేయాలని, పరీక్షల నిర్వహణ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని, బిడ్డల చదువుకు తల్లిదండ్రులపై ఆర్ధికభారం లేని విధంగా చూడాలన్నారు. రూ.2వేల కోట్ల వ్యయంతో ప్రతి కుటుంబానికి జేబు ఖర్చు లేని పద్ధతిలో వైద్యం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.