ఆంధ్రప్రదేశ్‌

లైన్ క్లియర్.. తరలింపునకు తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 27 నాటికి ఉద్యోగులంతా అమరావతికి వచ్చితీరాలన్న ఆయన పట్టుదలను నెరవేర్చుకుంటున్నారు. స్థానికత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక సమస్యలను ఉద్యోగులు సాకుగా చూపి, అమరావతి రావడానికి మొరాయించారు. అయితే, ప్రభుత్వం ఈ సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చింది. 30 శాతం హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం కొద్దిరోజుల కింద ట ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిం దే. ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన స్థానికత అంశానికి రాష్టప్రతి ఆమోదముద్ర వేయడంతో ఆ అడ్డంకి తొలగిపోయింది. విభజన చట్టంలోని 371(డి)ని సవరిస్తూ రాష్టప్రతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. 2014 జూన్ రెండో తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు అంటే 2017 జూన్ రెండో తేదీలోగా హైదరాబాద్ నుంచి ఎపికి తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తిసుందని ఆ నోటిఫికేషన్ సారాంశం. స్థానికతపై జారీ అయిన నోటిఫికేషన్‌కు సంబంధించిన గైడ్‌లైన్లు ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులతరలింపునకు సంబం ధించి 13 నుంచి 15వ తేదీలోగా ప్రభుత్వం రోడ్‌మ్యాప్ తయారు చేసి ఇవ్వబోతోంది. ఈ విషయమై మంత్రి నారాయ ణ మాట్లాడుతూ ‘ఉద్యోగులు అమరావతికి రావడానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయా యి. వారు ఇక్కడికి రావడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తాత్కాలిక సెక్రటేరియట్‌లో ఇంటీరియర్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 27 నుంచి పాలన అమరావతి నుంచి ప్రారంభమవుతుంది’ అని అన్నారు.
హెచ్‌ఓడిలపై సిఎం సీరియస్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ గజిటెడ్ ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలిశారు. తమకు ఎటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు కూడా అందలేదని వారు చెప్పుకొచ్చారు. గతంలో ఈ అసోసియేషన్ సభ్యులు పురంధ్రీశ్వరిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అక్కడ సాధ్యం కాకపోవడంతో ముఖ్యమంత్రిని కలిశారు. చంద్రబాబు నాయుడు వీరితో మాట్లాడుతూ ‘సమస్యలు ఏవైనా ఉంటే, మీరు నాతో చెప్పాలి. నన్ను కాకుండా వేరే వారిని కలిస్తే ఏం ప్రయోజనం?’ అని ప్రశ్నించారు. పురంధ్రీశ్వరిని కలవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు అందరికీ ఉన్నాయి. ఏదియేమైనా అమరావతికి రాక తప్పదని తేల్చి చెప్పారు.
ఆ తరువాత ఫోరం ప్రతినిధులు విలేఖరులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తే అమరావతికి రావడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. పిల్లల చదువులు, కొంతమంది మహిళా ఉద్యోగుల భర్తలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఫోరం ప్రతినిధి పద్మావతి, పటేల్, గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తమకు కొంత గడువు కావాలని సిఎంను కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వారు తెలియచేశారు.

చిత్రం... విజయవాడలో మీడియా పాయంట్ వద్ద మాట్లాడుతున్న హెచ్‌ఒడిలు