ఆంధ్రప్రదేశ్‌

అబద్ధపు హామీలతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధపు హామీలను రాష్ట్ర ప్రజలను మోసపుచ్చుతున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర 35వ రోజు గురువారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కందుకూరులో జగన్ మాట్లాడుతూ వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి సామాజికవర్గం కడుపుకొట్టారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వేస్తే అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూస్తామన్నారు. నవరత్నాలు అమలుచేసి అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. వృద్ధుల పెన్షన్ పెంచుతామని, 45 ఏళ్లకు బీసీలు, మైనారిటీలకు పెన్షన్ ఇస్తామన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం చెల్లిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైసీపీకి అధికారం కట్టబెట్టాలని అన్నారు. 35వ రోజు సుమారు 11 కిలోమీటర్లదూరం జగన్ నడిచారు. దారి పొడవునా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు తమ సమస్యలను జగన్‌తో ఏకరువు పెట్టారు.
హైదరాబాద్‌కు జగన్
కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా జగన్ గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. పాదయాత్రలో భాగంగా మధ్యాహ్నం చిగిచెర్ల గ్రామం వద్ద భోజన విరామం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లారు.