ఆంధ్రప్రదేశ్‌

త్వరలో విస్తరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 10: కృష్ణా పుష్కరాల తర్వాత ఏపి కేబినెట్ విస్తరణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీపరంగా మహానాడు, మహాసంకల్ప దీక్షలు, ఈ నెలలో రాజధానికి పాలనావ్యవస్థ తరలింపుప్రక్రియ పూర్తిచేసి, ఆపై విస్తరణ అంశంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాలోచనలు జరపనున్నట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం శాసనమండలిలో 58 మందికి గాను టిడిపికి 38 మంది సభ్యుల బలం ఉంది. వచ్చే మార్చిలో మరో 22 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో ఏడు సీట్లు ఎమ్మెల్యే కోటా, రెండుసీట్లు గవర్నర్ కోటాలోవి కాగా మిగిలినవి పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఖాళీలు. ఆగస్టులో పుష్కరాలు రానున్నాయి. సెప్టెంబర్‌లో మంత్రివర్గ విస్తరణ జరిపితే ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముందని, దీనివలన ఎలాంటి పేచీలు తలెత్తవని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటివరకు లోకేష్‌ను రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉండగా, ఆ ఆలోచనకు స్వస్తిచెప్పాలని పార్టీ నేతలు ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలియవచ్చింది. ఒకవేళ లోకేష్‌కు రాజ్యసభ సీటు ఇస్తే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నిధుల విషయంలో జాప్యం చేస్తున్నందున ఆ ప్రభావం ఆయనపై ఉంటుందని, ప్రత్యేకించి అది ముఖ్యమంత్రి, లోకేష్‌ల వైఫల్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేయవచ్చనే భావనతో లోకేష్‌ను శాసనమండలికి పంపాలని పార్టీవర్గాలు ప్రతిపాదించాయి. మంత్రివర్గ విస్తరణలో లోకేష్‌కు చోటు కల్పించి ఆరునెలల్లో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెప్తున్నారు. మార్చిలో ఖాళీ అయ్యే స్థానాల్లో అసమ్మతివాదులు, వలసలకు ప్రాధాన్యమివ్వాలని కూడా భావిస్తున్నారు.
కాగా శాసనమండలి చైర్మన్ చక్రపాణి పదవీకాలం మరో ఏడాది ఉన్నందున ఈలోగా లోకేష్‌తోపాటు మరికొందరు కీలక నేతలను పెద్దల సభకు పంపే యోచనతో ఉన్నట్లు తెలిసింది. జిల్లాల్లో జరిగిన మహానాడు, గత వారం రోజులుగా జరిగిన మహాసంకల్ప దీక్ష కార్యక్రమాల్లో పాల్గొనని మంత్రులపై చంద్రబాబుతోపాటు లోకేష్ ఆరా తీస్తున్నారు. పలువురు మంత్రులు ఇప్పటికీ తమ శాఖల మీద పట్టు సాధించలేకపోయారని, పార్టీ కార్యక్రమాల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో ఈసారి కేబినెట్ విస్తరణ తప్పదని పార్టీవర్గాల సమాచారం.