ఆంధ్రప్రదేశ్‌

బోధనలో అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యా బోధనలో అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) సంయుక్తంగా విశాఖలో శనివారం నుంచి మూడు రోజుల పాటు టెక్ సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యలో మానవీయ విలువలు జోడించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన, ఒత్తిడి లేని చదువుఅందించాలన్న లక్ష్యంతోనే ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. సదస్సుకు 75 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లు, విద్యారంగ ప్రముఖులు, పరిశోధకులు, విద్యారంగ ఉపకరణాల తయారీ నిపుణులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ప్లీనరీలు, డిబేట్‌లు, సమీక్షల విద్యారంగంలో అత్తుత్తమ ప్రమాణాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై మేథోమథనం జరుగుతుందన్నారు. యునెస్కో చైర్మన్ కరణ్‌సింగ్ మాట్లాడుతూ సాంకేతికతపై అపార అనుభవం ఉన్న ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారన్నారు.

చిత్రం..టెక్ సదస్సుపై విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న యునెస్కో చైర్మన్ కరణ్‌సింగ్