ఆంధ్రప్రదేశ్‌

టీడీపీతోనే దళితులకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 15: రాష్ట్రంలో దళితులకు టీడీపీ హయాంలోనే జరిగిందని, దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభించామని, వచ్చే జనవరి 26 నుంచి అంబేద్కర్ స్పూర్తితో పల్లెబాట పేరుతో గ్రామాల్లో పర్యటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరుజిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో టీడీపీ దళిత నేతలకు మూడురోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజధానిలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. దళితులకు రాజకీయంగా గుర్తింపు నిచ్చింది టీడీపీయేనన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడంతో పాటు పార్లమెంట్‌లో ఆయన ఫొటోను పెట్టించామన్నారు. హైదరాబాద్‌లో జగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటు, భవన నిర్మాణం చేయించామని, అదే సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించామన్నారు. కేఆర్ నారాయణ్ రాష్టప్రతి కావటానికి మద్దతిచ్చామన్నారు. దళితులను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అంబేద్కర్ స్పూర్తితో వచ్చే నెల 26 నుంచి నాయకులంతా గ్రామాల్లో పర్యటిస్తారని, 175 నియోజకవర్గాల్లో 175 కమిటీలు ఏర్పాటు చేసి ఒక కన్వీనర్‌ను పెడతామని, అన్ని నియోజకవర్గాల్లో మహాసభలు జరిపాక 13 జిల్లాల్లో సభలు జరుగుతాయని, ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ప్రారంభం జరుగుతుందని, ఏప్రిల్ 20న రాష్టస్థ్రాయిలో మహాసభ జరుపుతామని తెలిపారు. దళితులందరికీ న్యాయం జరుగుతుందని, పార్టీలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. మూడురోజులుగా దళిత నేతల మేధోమథనం బాగా జరిగిందని ఆయనన్నారు. అమరావతి నెంబర్ వన్ రాజధాని కావాలనేందుకు కష్టపడుతున్నామన్నారు. వరల్డ్ బెస్ట్ కంపెనీలన్నీ ఇక్కడికి తెస్తామన్నారు. గూగుల్ ఎక్స్ కంపెనీ వస్తున్నట్లుగా ఎన్నో కంపెనీలు ఇక్కడికి వస్తాయని అన్నారు.

చిత్రం..క్రిస్‌మస్ కేకు కట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు