ఆంధ్రప్రదేశ్‌

కళాతపస్విని ఆహ్వానించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రఖ్యాత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ వంటి మహనీయులను ఆహ్వానించకపోవడం తెలుగుజాతికే అగౌరవమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బాపు జయంతి వేడుకలు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కళాతపస్వి విశ్వనాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘బాపు జీవన సాఫల్య పురస్కారం’ అందించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి పితాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా ప్రపంచంలోని తెలుగువారంతా ఒక్కటేనన్నారు.
తెలుగు భాషకు పట్టంకట్టిన మహనీయులు ప్రపంచంలో ఎక్కడున్నా గౌరవించాల్సిందేనన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు విశ్వనాథ్ వంటి మహనీయులను మర్చిపోవడం విచారకరమన్నారు. తెలుగు భాష తెలంగాణ సొంతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి పితాని సత్యనారాయణ హితవుపలికారు.

చిత్రం..కళాతపస్వి విశ్వనాథ్‌కు బాపు జీవన
సాఫల్య పురస్కారం అందిస్తున్న మంత్రి పితాని