ఆంధ్రప్రదేశ్‌

జనవరి నుంచి పులుల గణన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 16: దేశవ్యాప్తంగా పులులను లెక్కించే కార్యక్రమం జనవరి మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని అటవీ అధికారులు తెలిపారు. పులుల గణనలో అటవీ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందని వారు తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ పులుల అభయారణ్యం రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దాని పక్కనే కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వరం పులుల అభయయారణ్యం ఉంది. నల్లమల అడవిలో మొత్తం మీద 150 పెద్దపులులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక చిరుతపులుల సంఖ్య 250కి పైగానే ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో చిరుతపులులు నల్లమల అడవితో పాటు కడప, అనంతపురం, చిత్తూరు, ఉభయగోదావరి, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయని వారు తెలిపారు. కాగా నల్లమల అడవుల్లో ఉండే పెద్దపులులు కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం అడవుల్లోకి కూడా వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే అవి ప్రస్తుతం అక్కడే ఉన్నాయా ఉంటే వాటి సంఖ్య శేషాచలం అడవుల్లో ఎంత అనేది జనవరి గణనలో తేలే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా 2014లో జరిపిన గణనలో నల్లమల అడవుల్లో 102 పెద్దపులులు, 175 చిరుతపులులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ పులుల్లో కర్నూలు జిల్లా ఆత్మకూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీడివిజన్ పరిధిలోనే సుమారు 66 పెద్ద పులులు ఉన్నట్లు తేలిందన్నారు. ఈసారి లెక్కింపులో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.