ఆంధ్రప్రదేశ్‌

సమస్యల పరిష్కారంపై లిఖితపూర్వక హామీ ఇవ్వకుంటే నిరవధిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు తమకు నోటి మాటగా ఇచ్చిన హామీని సోమవారం లిఖితపూర్వకంగా ఇవ్వని పక్షంలో మంగళవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. మున్సిపల్ కార్మికులకు రాజకీయాలకు అతీతంగా సీఐటీయు, ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ, వైఎస్సార్ టీయుసీ, టీయుసీసీ, ఐఎఫ్‌టీయు, ఇతర కార్మిక సంఘాలు ఆదివారం నాడిక్కడ మద్దతు ప్రకటించాయి. ప్రజారోగ్యం, పౌర సేవల పరిరక్షణ, కార్మికులకు ఉద్యోగ భద్రత, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌గా విభజన, విజయవాడ, విశాఖ నగరపాలక సంస్థ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు 0/0 పద్దు కింద జీతాలు వంటి అపరిష్కృత సమస్యలపై మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిరవధిక సమ్మెకు దిగబోతోంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం భేషజాలకు పోకుండా కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ఆమోదించి నిరవధిక సమ్మెను నిలువరించాలని వివిధ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగితే ప్రజలకు అగచాట్లు తప్పవని వారు పేర్కొన్నారు.