ఆంధ్రప్రదేశ్‌

జగన్‌వి అడ్డగోలు హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: అధికారం కోసం జగన్ అడ్డగోలుగా నోటికొచ్చిన, ఆచరణ సాధ్యంకాని హామీలు విసిరేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియని విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వాగ్దానాలుచేసి అమలు చేయగలిగితే ప్రజలు హర్షిస్తారని, నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేసేస్తే ఆదరణ లభించదన్నారు. ఇలా ప్రజలను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుమానాలన్నీ తొలగిపోయేలా కేంద్ర జలనవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టమైన ప్రకటన చేశారని యనమల పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పదే పదే చెబుతున్నప్పటికీ, కొందరికి ఎందుకు అనుమానం వస్తుందో అర్ధం కావడంలేదన్నారు. ప్రస్తుత గుత్తేదారుకు నెల రోజుల గడువివ్వాలని కేంద్రం సూచించిందని, అప్పటికీ పనిలో వేగం కన్పించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు. పోలవరానికి నిధుల కొరత లేదన్నారు. విభజన చట్టంలో ఉన్నందున కేంద్ర సహకారంతో ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేసి తీరుతామని యనమల స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మంత్రి వెంట ఉన్నారు.