ఆంధ్రప్రదేశ్‌

కళలు, కళాకారులను ప్రభుత్వమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 17: కళాకారులను ప్రభుత్వమే ఆదుకొని కళల అభివృద్ధికి విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ కోరారు. ఆదివారం తెనాలిలోని ఓ హోటల్‌లో 6వ జాతీయ చిత్రలేఖన, ఛాయాచిత్ర, శిల్పకళా పోటీలు అజంతా కళారామం వ్యవస్థాపకులు అక్కల వీరసత్య రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన గోపాలకృష్ణ మాట్లాడుతూ కళలు, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు మనస్సును ఉల్లాసపరుస్తాయని, అందుకే తెలుగు రాష్ట్రాల్లో అవి ఖ్యాతి చెందాయని, జాతీయ స్థాయిలోనూ అందరినీ మెప్పించగలిగాయని చెప్పారు. వీధి నాటకాలతో ప్రారంభమైన నాటక ప్రపంచం క్రమంగా పౌరాణిక, జానపద, సాంఘిక విభాగాల్లో స్టేజీ నాటకాలు, టిక్కెట్ నాటకాల వరకు ఎదిగాయని, అయితే వెండితెర సినిమాల ప్రాచుర్యంతో నేడు కనుమరుగౌతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎందరో మహానటులు నాటక రంగంలోకి ప్రవేశించి క్రమంగా సినిమా రంగంలోకి అడుగిడి తిరుగులేని కథానాయకి, నాయకులుగా చరిత్రలో నిచిపోయారన్నారు. అంతటి ఖ్యాతి చెందిన కళలను పోషించి, ఆదరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.
తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేడు సకల కళలకు కాణాచిగా తెనాలి పట్టణం విలసిల్లుతోందని, నవ్యాంధ్ర రాజధానికి దీటుగా పట్టణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని కూడా నిర్మించుకున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పింఛన్లు ఇస్తోందని, పలు ప్రాంతాల్లో ప్రఖ్యాతి చెందిన నాటక సమితులతో ప్రదర్శనలు ఇప్పిస్తోందని చెప్పారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన శిల్ప, చిత్రలేఖన, ఛాయాచిత్రాలను గోపాలకృష్ణ, ఆలపాటి, తదితరులు తిలకించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అక్కల వీరసత్య రమేష్, సుమారు 80మంది చిత్రకారులు, ఛాయాచిత్రకారులు పాల్గొన్నారు.

చిత్రం..అజంతా కళారామ సభలో ప్రసంగిస్తున్న నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ