ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూ శాఖపై పనిభారం పెంచొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: సిబ్బంది కొరత, అనూహ్య రీతిలో పెరుగుతున్న పని ఒత్తిడితో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందిపై ఇతర ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతలను బలవంతంగా రుద్దవద్దని ఆదివారం నాడిక్కడ రాష్ట్ర రెవెన్యూ భవన్‌లో జరిగిన రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణల్లో ప్రత్యేక రివిజన్ జరుగుతుండటం, 1100కు పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నందున ఇతర పనులపై దృష్టి సారించే అవకాశం లేకుండాపోతోందని సమావేశం పేర్కొంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొత్త నియామకాలు, మార్పులు చేర్పులతో సంఘాన్ని బలోపేతం చేశారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌర సేవల హామీ చట్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే ఇతర ప్రభుత్వ శాఖల విధులను కూడా తాము నిర్వర్తిస్తున్నందున సరిపడా యంత్రాంగం, వౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే ఈ చట్టాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని అన్నారు.
ఇతర శాఖలు నిర్వర్తించాల్సిన గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, పెన్షన్లు వంటి పనులను అప్పగించటం వల్ల తమ విధులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. సోమవారం నుంచి ఆదివారం వరకు వరుసగా ఫిర్యాదుల స్వీకరణ, వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లు, ఉన్నతాధికారుల సమీక్షలు వంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున ఫిర్యాదుల పరిష్కారంలో అంతులేని జాప్యం జరుగుతోందన్నారు. ముఖ్యంగా 1100లో చోటుచేసుకుంటున్న సాంకేతికపరమైన లోపాలను సరిదిద్దాలని కోరారు.
రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బలోపేతానికి తగిన చర్యలు చేపడుతూ ఇందులోభాగంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంవి రమణకు ఉపాధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ సీసీఎల్‌ఏ కార్యాలయం గజిటెడ్ సూపరింటెండెండ్ ఎన్ శ్రీనివాస్‌ను ఆ స్థానంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ప్రకాశం జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ తెనే్నరు వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లాకు చెందిన జి శ్రీలతలను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా, తోట శ్రీవల్లి (విజయవాడ)ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు లాం విద్యాసాగర్ రాజీనామాను ఆమోదిస్తూ జిల్లా కార్యవర్గాన్ని రద్దుచేశారు. 2018 ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు కాకినాడలో ఐదో రాష్టస్థ్రాయి రెవెన్యూ క్రీడోత్సవాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.