ఆంధ్రప్రదేశ్‌

నిధి దొరికితే రాత మారినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 17: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గుప్త నిధుల తవ్వకాలపై దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆసక్తి నెలకొన్నట్లు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చెన్నంపల్లి కోటను ఖజానా కార్యాలయంగా వినియోగించుకున్నట్లు విజయనగర సామ్రాజ్యంపై పరిశోధనలు నిర్వహించిన విదేశీయులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. విజయనగర రాజులకు నమ్మినబంటుగా ఉన్న నాటి చెన్నపట్నం (నేటి చెన్నంపల్లి) రాజు చెన్నమనాయుడు ఆధ్వర్యంలో ఈ ఖజానా కార్యాలయం పనిచేసేదని వారు పేర్కొన్నారు. విజయనగర రాజుల కాలంలో జరిగిన యుద్ధాల సమయంలో ప్రత్యర్థులు పలు ఖజానాలను కొల్లగొట్టినా చెన్నంపల్లి కోటను మాత్రం ఏమీ చేయలేకపోయారని విదేశీయుల పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాటి కృష్ణదేవరాయలు ఖజానాగా ఉన్న పెనుకొండలో సైతం ప్రత్యర్థులు దాడి చేసిన సమయంలో కొంత ఖజానాను ఎత్తుకెళ్లారని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఆ తరువాతి కాలం నుంచి ఇటీవలి కాలం వరకూ పెనుకొండ ప్రాంతంలో అనేక మంది గుప్త నిధులు తవ్వి లాభపడ్డారని పెనుకొండ ప్రాంతంలోని ఓ స్వామీజీని ఉద్దేశించి వారు పేర్కొన్నారు. విదేశీయుల పరిశోధనలో వెల్లడైనట్లు చెన్నంపల్లి ఖజానాలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే పెద్దఎత్తున బంగారు, వజ్ర వైఢూర్యాలతో పాటు నాటి రాజులు వాడిన అనేక ఆయుధాలు, మానవ రక్షిత సామాగ్రి తదితరాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ నిధి లభ్యమైతే రాష్ట్ర తలరాతే మారిపోతుందని దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా అవతరించే అవకాశాలు లేకపోలేదని వారు తెలిపారు. ప్రభుత్వం పరిశోధకులు ఇచ్చిన నివేదికను పరిశీలించి మొదట అనధికారికంగా తవ్వకాలు ప్రారంభించినా ఆ తరువాత ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. గత ఐదు రోజులుగా జరుగుతున్న తవ్వకాలు ఇంకా కొద్ది రోజులు కొనసాగిస్తే భూగర్భంలో ఉన్న ఖజానా దగ్గరకు చేరుకోగలమని వెల్లడిస్తున్నారు. చెన్నంపల్లి గుప్త నిధుల తవ్వకాలపై ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. నిధి లభ్యమైతే తమ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం 30 శాతం నిధిని కేటాయించాలని గ్రామ కమిటి తీర్మానించినట్లు తెలుస్తోంది. ఇదే తీర్మానాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ, మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో మండల సభలో కూడా తీర్మానించాలని వారు కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే గ్రామంలోని ఒకరిద్దరు స్థానికంగా తవ్వకాలను పరిశీలిస్తున్న అధికారులకు తమ విజ్ఞప్తిని సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చెన్నంపల్లి కోటలో నిధులు లభ్యమైతే ప్రభుత్వం ఆ గ్రామానికి తక్కువ చేస్తుందని తాము అనుకోవడం లేదన్నారు. నిధి ఉన్న మాట వాస్తవమే అయితే కోట్లాది రూపాయల విలువైన బంగారు, వజ్ర, వైఢూర్యాలు లభిస్తే చెన్నంపల్లి గ్రామం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం ఖాయమని వారంటున్నారు. ప్రజల కోరికను ప్రభుత్వం ఖచ్చితంగా మన్నిస్తుందన్న అభిప్రాయాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు.

కచిత్రం..ర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి కోట