ఆంధ్రప్రదేశ్‌

ఫాతిమా విద్యార్థుల సమస్యపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద 3వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో నుండి 100 సీట్లను ఫాతిమా కళాశాల విద్యార్థులకు కేటాయించేందుకు యత్నించామని, నిబంధనలు అడ్డురావడంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సుప్రీం కోర్టులో స్పెషల్ లివ్ పిటిషన్ వేసేందుకు ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సుప్రీం కోర్టు పిటిషన్‌కు అనుమతించకపోతే ఫాతిమా విద్యార్థులు నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఫీజులు తిరిగి ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. పోలవరం, కొల్లేటి సమస్యల పరిష్కారానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, పీయూష్ గోయల్, హర్షవర్ధన్‌లను కలవనున్నట్లు మంత్రి తెలిపారు. జనవరి 2 నుండి జరగబోయే జన్మభూమి కార్యక్రమం 10రోజుల్లో ఒకరోజు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.