ఆంధ్రప్రదేశ్‌

తెలుగు మహాసభలా.. రాజకీయ సభలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్‌ఎస్ రాజకీయ సభల్లా గోచరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. అసలివి ప్రపంచ తెలుగు మహాసభలా, లేక రాజకీయ సభలా అర్థం కాని స్థితి నెలకొందన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన తెలుగు కవులు, రచయితలను విస్మరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు జరపటం సముచితం కాదన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ, ప్రజా గాయకులు గద్దర్, ప్రజాకవి అందెశ్రీ వంటివారిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించకపోవడం వారి అనుచిత వైఖరికి నిదర్శనమన్నారు. మహాసభలను ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వపడేలా జరపాల్సి ఉండగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను విస్మరించడం ఏమాత్రం సబబు కాదన్నారు.
తోటి తెలుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సైతం ఆహ్వానించకపోవడం కేసీఆర్ అవివేకానికి తార్కాణమని విమర్శించారు. తమ రచనల ద్వారా ప్రజా ఉద్యమాలను ప్రభావితం చేసిన కవులు, కళాకారులు, రచయితలకు తెలుగు మహాసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే అవి రాజకీయ సభలుగా మిగిలిపోతాయే కాని ప్రపంచ తెలుగు మహాసభలుగా మనజాలవని రామకృష్ణ స్పష్టం చేశారు.