ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి సహకరించకపోతే చరిత్రహీనులే: ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 13: కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ అడ్డగోలుగా విభజించిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి సహకరించకపోతే చరిత్రహీనులు అవుతారని ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణమనాయుడు హెచ్చరించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, చంద్రబాబు చివరి వరకు పోరాడిన విషయం ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. చివరకు విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసింది ఒక్క వెంకయ్యనాయుడేనని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ దాన్ని చట్టబద్దం చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.
ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మట్టి, నీరు తీసుకుని ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు అక్కడికి వెళితే పట్టించుకునేవారు ఉండరని తీసుకెళ్లిన మట్టి నోట్లో వేసుకుని, నీటిని నెత్తిపై పోసుకుని వెనక్కి రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ కార్యదర్శి రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, నాయకులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్‌సింగ్ వంటి వారు పార్లమెంట్ ముందు దీక్ష చేయాలన్నారు. అలా జరిగితే ప్రధాని స్పందించే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మణం
తాడిపత్రి, మార్చి 13: అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని కడవకల్లు గ్రామం సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. నార్పల మండలం రంగాపురం గ్రామానికి చెందిన రామాంజి(55) మరొకరితో కలిసి ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి బయల్దేరాడు.
అలాగే పుట్లూరు మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన నాగముని(16), లోకనాథ్ కలిసి మరొక ద్విచక్ర వాహనంపై అనంతపురం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. ఈ రెండు వాహనాలు కడవకల్లు గ్రామ సమీపంలో మలుపు వద్ద అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామాంజి, నాగముని అక్కడికక్కడే మృతి చెందగా, లోకనాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైక్‌లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోకనాథ్‌ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.