ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ వ్యవహారంలో సర్కారుకు ముచ్చెమటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 11: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన ఆమరణ దీక్ష పోలీసు పహారా మధ్య కొనసాగిస్తున్నారు. ముద్రగడ పట్టువీడకపోవడం అధికార వర్గాల్లోను, కొన్ని సామాజిక వర్గాల్లోనూ కంగారు పుట్టిస్తోంది. ఒకవైపు ఆమరణ దీక్షను భగ్నంచేసి, ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఏమిచేయాలో తోచని స్థితిలో పడ్డారు. సిబి సిఐడి రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని చెప్పినా ఆ కేసుల్లో మాత్రం ముద్రగడను అరెస్టుచేయలేదు. కిర్లంపూడి, అమలాపురంల్లో నమోదైన రెండు కేసులనూ చూపించలేదు. కేవలం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతోనే అదుపులోనికి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు చూపిస్తే బెయిల్ తీసుకోరనే ఉద్దేశ్యంతోనే పోలీసులు అరెస్టు చూపించడం లేదు. కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేక ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మొదటి రెండు రోజుల్లో దూకుడుగా వ్యవహరించిన ప్రభుత్వం వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే ప్రధాన అనుచరలను సిఐడి కేసుల్లో అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. మంగళగిరిలో ముద్రగడకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కాపు సామాజిక సమావేశం జరిగినా పెద్దగా స్పందన రావడం లేదంటున్నారు.
ముద్రగడకు అనుకూలంగా విజయవాడలో పోటీ సమావేశం కూడా నిర్వహించారు. కాపు సంఘాల జెఎసి 13 జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చి చేయించింది. ఈ నేపథ్యంలో జగన్ ఆరోపణలకు ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదన ముద్రగడ తిరస్కరించి, భేషరతుగా అరెస్టుచేసిన వారందర్నీ విడుదల చేయాలనే డిమాండుపై భీష్మించుక్కూర్చున్నారు. మరోపక్క జిల్లాలో ముద్రగడకు కూడా మద్దతు పలుకుతోంది. సామాజిక సమస్య కంటే శాంతి భద్రతల కోణంలో ముద్రగడను అదుపులోనికి తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినా అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చింది. ఇతర సామాజిక వర్గాలు కూడా కొంతమంది ముద్రగడకు మద్దతు పలుకుతున్నారు.
దీక్ష చేస్తే అరెస్టా? : మాజీ మంత్రి జోగయ్య
పాలకొల్లు: ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ కోరారని, దీనికి కాపు సామాజిక వర్గమంతా (టిడిపి మినహా) మద్దతు పలికిందని మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జనవేదిక గౌరవ అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తానొక్కడిగా ఉద్యమించటంతోపాటు వివిధ రాజకీయ పార్టీల మద్దతు పొందాలని శాంతియుతంగా ఆయన చేస్తున్న దీక్షకు భయపడిన ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని చేస్తున్న చర్యలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ముద్రగడ అరెస్టు ద్వారా ప్రభుత్వం చేస్తున్న పద్ధతులను ఆయన తప్పు బట్టారు. తెలుగుదేశం పార్టీకి అడ్డుగా ఉన్నారని నాడు వంగవీటి మోహనరంగా పట్ల ప్రవర్తించిన పద్ధతిని నేడు ముద్రగడ విషయంలో ప్రభుత్వం ఆనుసరించటం గర్హనీయమన్నారు. రంగాకు జరిగిన సంఘటన ముద్రగడకు జరిగితే జాతి చంద్రబాబుని క్షమించదన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని జోగయ్య చంద్రబాబును కోరారు.

చిత్రం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద రక్షణ వలయాలు,
మెయిన్‌రోడ్డులో దుకాణాలు మూసివేసిన దృశ్యం