ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్షపై పవన్ వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 12: కాపుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్షపై తన వైఖరిని స్పష్టం చేయాలని సినీహీరో పవన్‌కళ్యాణ్‌ను రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రశ్నించేందుకు పార్టీని స్థాపించిన పవన్ కాపుల సంక్షేమం కోసం ఇప్పటికైనా నోరుతెరవాలన్నారు. ఆదివారం ఆయన ముద్రగడను కలిసేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ కాపు ఐక్యగర్జనలో రాయలసీమ రౌడీలు విధ్వంసం సృష్టించారని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈకేసుల్లో కోనసీమ వాసులను ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. జాట్లు, పటేళ్ల తరహాలో కాపులను కూడా బిసిల్లో చేర్చాలన్నారు. బ్రిటీష్ కాలంలో కాపులు బీసీల్లోనే ఉండేవారని ఆయన చెప్పారు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వారిని బిసిల జాబితా నుంచి తొలగించారన్నారు. ఆ తరువాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో 30ని జారీ చేశారని పేర్కొన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల జీవో అమల్లోకి రాలేదన్నారు. ముద్రగడ డిమాండ్ కొత్తదేమీ కాదన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని ముద్రగడ కోరుతున్నారన్నారు. ఇప్పటికైనా కాపులను బీసీల్లో చేర్చాలని విహెచ్ డిమాండ్ చేశారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో సహచరుడైన ముద్రగడతో ఉన్న సాన్నిహిత్యం వల్లే పరామర్శించేందుకు వచ్చానని చెప్పారు. ముద్రగడ దీక్షను అడ్డుకుంటున్న టిడిపి ప్రభుత్వం, పోలీసులు వైసిపి అధినేత జగన్‌కు మూడుసార్లు దీక్ష చేసే అవకాశం ఎలా కల్పించారని నిలదీశారు. ముద్రగడ దీక్షకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గమనించి ప్రభుత్వం అభద్రతా భావానికి లోనవుతోందని ధ్వజమెత్తారు. ముద్రగడ దీక్షకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పారు. ఆయనకు ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలని విహెచ్ సూచించారు. రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి లేఖపై నారాయణ విమర్శలను ప్రస్తావిస్తూ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా నటుడే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. విద్యార్థుల నుంచి కోట్ల డొనేషన్లు వసూలు చేస్తున్న నారాయణకు విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
చిత్రం ముద్రగడను పరామర్శించేందుకు ఆదివారం రాజమండ్రికి వచ్చిన విహెచ్