ఆంధ్రప్రదేశ్‌

నిబంధనలు పాటించని పాఠశాలల సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: విశాఖ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 32 పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు సోమవారం తాళాలు వేశారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, వేసవి సెలవుల అనంతరం తెరవడంతో అధికారులు దాడులు చేసి మూయించేశారు. జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను మూయించి వేయాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో, విద్యాశాఖాధికారులతో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సమావేశం నిర్వహించారు. గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా ఝుళిపించాలని, ఇప్పటికే తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్-2 నేతృత్వంలో డిఇఒ, ఎసిసి, తదితర అధికారులతో టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్సు అధికారులు గాజువాక, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో సోమవారం దాడులు చేశారు. గుర్తింపు లేకపోవడం, అపార్టుమెంట్లల్లో పాఠశాలలు నిర్వహించడం వంటి వాటిని గమనించి వాటిని మూసివేశారు. అయితే పాఠశాలలు పునఃప్రారంభమైన రోజున ఈ దాడులు నిర్వహించడంపై తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా ఫీజులు చెల్లించామని, వేసవి సెలవుల సమయంలో దాడులు చేపట్టకుండా ఇప్పడు చేపట్టడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.