ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌పోర్ట్ పనుల్లో జాప్యంపై సిఎం అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన గన్నవరం విమానాశ్రయం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణా పుష్కరాల ప్రారంభం లోపు టెర్మినల్ పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పనులు మందకొడిగా సాగుతున్నాయని, మెరుగైన పనితీరు కనబరిచేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చిత్రం గన్నవరం విమానాశ్రయంలో అధికారులకు సూచనలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు