ఆంధ్రప్రదేశ్‌

రాజన్న ఆశయాలు సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడానికి ప్రజలందరూ కలిసి రావాలని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొత్తవేపకుప్పం గ్రామం నుంచి శుక్రవారం ఉదయం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ గావించిన అనంతరం ఆయన ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందించారని చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పరిమితం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. మహిళా సాధికారత కోసం రాజన్న వడ్డీలేని రుణాలు అందిస్తే మహిళలకు రుణాలు ఇవ్వడమే తెలుగుదేశం ప్రభుత్వం మానివేసిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నతవిద్య అవకాశం కల్పిస్తే నేటి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను వీధిపాలు చేసిందని విమర్శించారు. రాబోయే కాలంలో వైకాపాని అధికారంలోకి తేవాల్సిందిగా ప్రజలు దేవుడ్ని ప్రార్థించాలని, తాను ముఖ్యమంత్రి అయిన అనంతరం రాష్ట్రానికి నవరత్నాలతో సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కొత్తవేపకుప్పం, నెత్తకుప్పం, నెత్తకుప్పం దళితవాడ గ్రామాలలో రాజన్న విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెత్తకుప్పం పంచాయతీ జయరాంనగర్ గ్రామంలోని రాజశేఖర్‌రెడ్డి అభిమాని అయిన దొరసామినాయుడు అనే వికలాంగుడిని పరామర్శించి అన్నింటికీ తానున్నానని భరోసా ఇచ్చారు. నెత్తకుప్పం సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్ మరికొంత మందికి పార్టీ కండువా వేసి వైకాపాలోకి ఆహ్వానించారు.

చిత్రం..కొత్తవేపకుప్పం గ్రామంలో శుక్రవారం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర