ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి నాబార్డు రుణం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వెచ్చించిన 12 వేల కోట్ల రూపాయల నిధులను ఇప్పించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గత డిసెంబర్ నుండి ఇంత వరకు 7,800 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసి ఉండగా 4,300 కోట్లు ఇచ్చారని, మిగతా నిధులు ఇంకా ఇవ్వవలసిన అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన తాజా అంచనాలతోపాటు డీపీఆర్‌ను కూడా కేంద్రానికి అందజేశామని, త్వరితగతిన నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని 2019లోగా పూర్తిచేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాబార్డ్ నుండి నిధులు ఇప్పించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మోదీని కోరినట్లు ఆయన వెల్లడించారు. పోలవరం సమస్యలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయని తెలిపారు. ఇప్పుడు పిలిచిన టెండర్లను అలాగే కొనసాగిస్తూ ఇదే రేట్లకు ఇతరులెవరైనా పనిచేస్తారా? అనే విషయాన్ని అనే్వషించనున్నట్లు తెలిపారు. ఎగువ కాపర్ డ్యాం నిర్మాణానికి డిజైన్లు ఇచ్చారన్నారని, పోలవరానికి సంబంధించిన అన్ని అనుమతులు లభించాయని, సాంకేతిక అంశాలు కూడా పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి 53 శాతం పనులు పూర్తయ్యాయని, భూ సేకరణ దాదాపు 73 శాతం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నిర్ధారించిన వనరుల మధ్య ఉన్న వ్యత్యాసం 16 వేల కోట్లని, ఇందులో నుండి 3,900 కోట్లు మాత్రమే ఇంతవరకు ఇచ్చారని, మిగతా నిధులు ఇప్పించాలని మోదీని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆంధ్రుల చిరకాల కోరికని, దీనిని పూర్తిచేయాలని కూడా మోదీని కోరినట్లు ఆయన చెప్పారు. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటు, కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సైతం కేటాయింపు గురించి కూడా మోదీతో చర్చించినట్లు తెలిపారు. దుగ్గిరాజపట్నం ఓడరేవు వ్యవహారం గురించి కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దుగ్గిరాజపట్నం ఓడరేవు నిర్మాణం సాధ్యం కాదనే విధంగా మాట్లాడారని, కడప ఉక్కు కార్మాగారం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నుండి రాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమైన తరువాత మీడియాతో మాట్లాడుతున్న సీఎం బాబు