ఆంధ్రప్రదేశ్‌

కాఫర్ డ్యామ్‌తో డేంజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 12: పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇంజనీర్లు ఒత్తిళ్లకు లొంగితే జైళ్లకు వెళ్ళాల్సిన పరిస్థితి చవిచూడాల్సి వస్తుందని మెరైన్ జియాలజిస్ట్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం ఆదరాబాదరా నిర్మించడం సరికాదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. మన ఇంజనీర్లు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)కి ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంవల్ల ప్రయోజనాలు, నష్టాలు కూడా ప్రజలకు వివరించాలన్నారు. కాఫర్ డ్యామ్ ఎత్తు ఆకస్మికంగా పెంచడం ప్రమాద సంకేతమన్నారు. తన హయాంలోనే నీరిచ్చామని చెప్పడానికే ముఖ్యమంత్రి గ్రావిటీపై కాల్వలకు నీరివ్వాలనే ఉద్ధేశ్యంతో కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచుతున్నారన్నారు. గోదావరి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నది అని, లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఆపడంలో శాస్ర్తియత లేకపోతే పెనుప్రమాదం కొన్ని తెచ్చుకోవాల్సిందేనన్నారు. పులిచింతల ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన అనుభవాన్ని మర్చిపోకూడదన్నారు. భారీ స్థాయిలో కాంక్రీటుకు నిన్న మొన్నటి వరకు కూలింగ్ ప్లాంటు అందుబాటులో లేదన్నారు. పోలవరం ప్రపంచంలోనే ఒక వైవిద్యమైన ప్రాజెక్టుఅని, డ్యామ్ ఒక చోట, స్పిల్ వే మరోచోట నిర్మించే ప్రాజెక్టన్నారు. దండుకుని తినడానికి తప్ప పోలవరం నిర్మించాలనే దక్షత రాష్ట్ర ప్రభుత్వంలో కన్పించడం లేదన్నారు. కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మాణంలో రాజీపడితే పెను ప్రమాదమేనన్నారు. వైఎస్ హయాంలోనే పునాదిపడిన ఈ ప్రాజెక్టు భావి తరాలకు భద్రత, భరోసా కల్పించాలని హర్షకుమార్ పేర్కొన్నారు. జాతి యావత్తు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు భద్రతలో భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రం వత్తిడికి కేంద్రం లొంగకుండా సాంకేతిక కమిటీల నివేదికల ఆధారంగా ప్రాజెక్టును నిర్మించాలన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, పునాదిలో గాలిపొరలు వున్నాయని తెలుస్తోందన్నారు. నిర్వాసితుల్లో దాదాపు లక్ష మందికి ఇళ్లు నిర్మించాల్సివుందని, వారందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలని హర్షకుమార్ కోరారు.