ఆంధ్రప్రదేశ్‌

ఎలాగైనా ఆడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 13: ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర ఉత్కంఠ భరితమైన సీన్ ఆవిష్కృతమవుతోంది. గ్రామాలన్నీ పోలీసు పహారా మధ్యలో చిక్కుకుపోగా మరోవైపు ఎలాగైనా ఆ మూడురోజులు పందాలు సాధ్యం చేసుకోవాలని నిర్వాహకులు అంతా రెడీ చేసుకుని ఉన్నారు. అంతకుమించి ప్రస్తుతానికి కోడిపందాలకు సంబంధించి సరికొత్త వ్యవహారాలు తెరపైకి రాలేదు. అయితే వీటికి మించి ఈసారి పందాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు నిర్వాహకులకు అద్భుతమైన ఐడియాలు వస్తున్నాయి. గత ఏడాది ల్యాప్‌ట్యాప్‌లు పందాల వద్ద పెట్టేసి విదేశాల్లో కూడా వీటిని వీక్షించే అవకాశం కల్పించిన కొందరు నిర్వాహకులు ఈసారి దాన్ని అధిగమించి ఆన్‌లైన్ లావాదేవీలకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఇంతకుముందు ఎన్నడూలేని స్థాయిలో పోలీసు పహరా స్పష్టంగా కన్పిస్తోంది. దాదాపు అన్నిచోట్ల ఇదివరకు ఇప్పటికే బరులు సిద్ధం చేసి ఇక రేపటినుంచి వచ్చే జనం కోసం వేచి చూస్తుండేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి చాలాచోట్ల లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. పోలీసు యంత్రాంగం చాలాచోట్ల బరులను సిద్ధం చేయనివ్వకుండా ముందుగానే చర్యలు తీసుకుంది. కొన్నిప్రాంతాల్లో వేసిన బరులను కూడా ధ్వంసం చేసి అక్కడ ఏర్పాటుచేసిన స్తంభాలు, ఇతర సామాగ్రిని అక్కడినుంచి తరలించుకుపోయారు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు కూడా తాము ఏమి తక్కువతినలేదన్నట్లు బరులు ఏర్పాటుచేసేందుకు అవసరమైన సామాగ్రిని ట్రాక్టర్లు, లారీల్లో ఆ ప్రాంతానికి సమీపంలో దాచి ఉంచి సంకేతం రాగానే కొద్దిగంటల వ్యవధిలోనే కోడిపందాలకు సిద్ధమయ్యేందుకు రెడీగా ఉన్నారు. శనివారం మాత్రం జిల్లావ్యాప్తంగా కొన్నిచోట్ల చిన్నచితకా పందాలు జరిగినా ఆదివారం నుంచి భారీ పందాలు మొదలవుతాయని భావిస్తున్నప్పటికీ ఆ పరిస్థితి ఉంటుందా, ఉండదా అన్నది నిర్వాహకుల్లో టెన్షన్‌ను పెంచుతోంది. ఈ పరిస్థితులు ఇలాఉంటే అసలంటూ సంకేతం వచ్చి పందాలకు సిద్ధమైతే ఈసారి కొందరు నిర్వాహకులు నిర్వహణ రూట్‌ను మార్పు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికక్కడ ఇంతకుముందు బరుల వద్దే 500, 1000 రూపాయల నోట్ల కట్టలు దర్శనమిస్తూ ఉండేవి. వాటితోనే పందాలన్నీ అక్కడికక్కడ నగదు రూపంలో చెల్లుబాటు అయ్యేవి. కానీ ఈసారి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటం, కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయటంతో కొంత జాగ్రత్త పడినట్లు కన్పిస్తోంది. కత్తులు కట్టకుండా, జూదం ఆడకుండా పందాలు నిర్వహించుకోవచ్చునని కొంతమంది ప్రచారం చేస్తుండగా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని పందాలు యధాప్రకారం నిర్వహించి నగదు రూపంలో కాకుండా పందాల మొత్తాలను భూముల దస్తావేజుల రూపంలోను, ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరుపుకునేందుకు కొన్నిచోట్ల ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విధంగా పోలీసు పహరా పరిధిలోకి రాకుండా తప్పించుకోవచ్చునని కొంతమంది తెలివైన ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తనకు వచ్చిన సమాచారం ఆధారంగా బలగాలను పరుగులు పెట్టిస్తున్నట్లు కన్పిస్తోంది. అందరి శెలవులు రద్దు చేసి పండుగ మూడురోజులు గ్రామాల్లోనూ, పోలీసుస్టేషన్లలోనూ ఉండి తీరాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంప గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ప్రతిఏటా కోడిపందాలు నిర్వహిస్తూ ఆనవాయితీగా వస్తున్నారు. ఈసారి కూడా భారీ పందాలు నిర్వహించటంతోపాటు చీర్‌గరల్స్‌ను కూడా రప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈఏడు అటు పొలిటికల్, ఇటు పోలీసుల మధ్య సినిమా ఫక్కీలో వార్ ప్రారంభమైంది. ఇక విజేత ఎవరో ఆదివారం మధ్యాహ్ననికి తేలిపోనుంది.