ఆంధ్రప్రదేశ్‌

అడ్డగోలు ఫీజులపై టాస్క్ఫోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టానుసారం అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 60,462 స్కూళ్లు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయని, విద్యార్ధులకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించామని, స్కూళ్లలో వౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి రాజీ లేదని అన్నారు.అడ్డగోలు ఫీజులపై టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రతి జిల్లాలో డిఇఓ, ఆర్వీఎం పిఓ, రెవిన్యూ, రవాణా శాఖాధికారులతో టాస్క్ఫోర్సులు ఏర్పాటు అవుతాయని అన్నారు. ఫిట్‌నెస్ లేని స్కూలు బస్సులు సీజ్ చేస్తామని, దాని యజమానులపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. మనబడి కార్యక్రమంలో భాగంగా 2.80 లక్షల మంది విద్యార్ధులను బడిలో చేర్చి అడ్మిషన్లు ఇచ్చామని తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకూ బడిబాట నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవలే 8924 మంది టీచర్లను నియమించామని, వారికి 10 రోజుల పాటు బోధనపై శిక్షణ అందజేస్తామని అన్నారు.