రాష్ట్రీయం

లండన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో ఆదివారం 8వ సంక్రాంతి వేడుకలు తూర్పు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన అశోక్ నుకాల జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించి ముందుతరాలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఈసందర్భంగా ఆయన సూచించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు భోగిపళ్లు, ఫ్యాన్సీ డ్రెస్, వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన ఆద్యంతం అలరిస్తూ సాగింది. భోగిపళ్లతో పిల్లలకు ఆయురారోగ్యాలు కలుగుతాయని పద్మ కిల్లి అన్నారు. ట్రస్టీ గీత మోర్ల మాట్లాడుతూ తెలుగువారి ఒక్కో పండుగ వెనుక ఒక్కో పరమార్థం ఉందన్నారు. అన్నీ గ్రహించేవారు ఉత్తములుగా తయారవుతారని అన్నారు. సంస్థ అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల మాట్లాడుతూ తెలుగు పండుగ రోజు తెలుగు వారంతా తెలుగునేల కానిచోట కలుసుకోటమే ఒక పెద్ద పండుగ అని అన్నారు. బాలల సాంస్కృతిక ప్రదర్శనలు చూస్తుంటే బ్రిటన్‌లో తెలుగు భాషా సంస్కృతులను మరవకుండా పిల్లలకు తెలుగు వారసత్వాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక వందనాలని అన్నారు. మన భాషా సంప్రదాయాలనే కాకుండా మన వంటలు, పిండి వంటలను కూడా ఈసారి రుచి చూపిస్తూ తెలుగు రుచులను జగద్విదితం చేద్దామని పిలుపునిచ్చారు. ఐదు గంటలు సాగిన ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. సంస్థ కార్యవర్గ సభ్యులు సత్యప్రసాద్ మద్దసాని, నరేంద్ర మున్నలూరి, రుద్రవర్మ బట్ట, బలరాం, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..తూర్పు లండన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న తెలుగువారి కుటుంబాలు