ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 14: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ ఈవో వైవీ అనూరాధ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఆదివారం ఉదయం భోగి మంటలు వేశారు. శనివారం సాయంత్రం భక్తులను ఆద్యంతం ఆకట్టుకునేలా చూడముచ్చటగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. పండుగ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వేకువజామున భోగి మంటలు వేసి, గంగిరెద్దులను ఆడించారు.
లక్ష ఆవు పిడకలతో భోగి మంటలు
గోసంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టి పనిచేస్తున్న అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా విజయవాడ కృష్ణలంక హైస్కూలు ప్రాంగణంలో ఆదివారం ఉదయం లక్ష ఆవు పిడకలతో వైభవంగా భోగి మంటలు వేశారు. ఓవైపు గంగిరెద్దుల విన్యాసాలు, మరోవైపు హరిదాసుల భజనలు, కీర్తనలు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భోగిమంటలకు జ్యోతి వెలిగించి ఆవునెయ్యి పోసి అంకురార్పణ చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ పనికిమాలిన ఆలోచనలను వదలుకుని సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలు తీసుకురావటానికి ఉద్దేశించినవే ఈ భోగి మంటలని అన్నారు. నేటితరం దీనికి భిన్నంగా తమ ఇళ్లల్లో పనికిమాలిన ప్లాస్టిక్, ఇతరత్రా పరికరాలను రోడ్డుపై వేసి భోగిమంటలు వేస్తుండటం వల్ల వాతావరణ కాలుష్యం పెరగటం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. సమితి అధ్యక్ష, కార్యదర్శులు ముత్తవరపు మురళీకృష్ణ, డాక్టర్ దాసం ఉమామహేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, విశ్వహిందూ పరిషత్ నేతలు జీడీవీ ప్రసాదరావు, తొండెపి హనుమంతరావు, ప్రముఖ న్యాయవాది యాబలూరి లోకనాథశర్మ, పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ, రైతు సంఘాల నేత అనుమోలు గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఇంద్రకీద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భోగిమంటలు