ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రార్థించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14:ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని తన ఇలవేల్పయిన శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సంబరాలను తన జన్మస్థలమైన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో కుటుంబ సభ్యులతో కలసి జరుపుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు కాటకాలు లేకుండా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థించానన్నారు. ఇందులో భాగంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, యువతకు ఉపాధి, ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనకు శక్తిని ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంక్రాంతి, భోగి పండుగలనాడు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇలవేల్పు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నారు. అందుకే భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుకూలంగా టీటీడీ కూడా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించుకుని సౌకర్యాల కల్పనకు ప్రత్యేక దృష్టిసారిస్తోందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆనందం, సుఖ సంతోషాలు, మెరుగైన జీవన ప్రమాణాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
తాతా.. లడ్డూ కావాలి!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబునాయుడు తో కూడా ఉన్న మనుమడు దేవాన్హ్ తాతా నాకు లడ్డూ కావాలి అని అడిగి మరీ తెప్పించుకుని రుచిచూశాడు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టిటిటి ఇఓ ఇతర అధికారులు వడ, కట్టెపొంగలి, చక్కెర ఇతర ప్రసాదాలను అందిస్తుండగా ముఖ్యమంత్రి తన ఒడిలో కూర్చుని ఉన్న మనవడు దేవాన్ష్‌కు చక్కెర పొంగళిని తినిపించారు. తనకు లడ్డూ కావాలంటూ దేవాన్ష్, తాత చంద్రబాబు నాయుడుని అడిగాడు. దీంతో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అధికారులు నవ్వులు పూయించారు. వెంటనే లడ్డూని తెప్పించారు. నాయనమ్మ భువనేశ్వరి మనవడు దేవాన్ష్‌కు స్వామి వారి ప్రసాదమైన లడ్డూని తినిపించారు. తాత చంద్రబాబు నాయుడుతో కలసి శ్రీవారి దర్శనానికి పంచెకట్టుతో దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాగా దేవాన్హ్ నానమ్మ భువనేశ్వరి చేతివేలు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే తాత చంద్రబాబు నాయుడు వెనుక అనుసరించడం చూడ ముచ్చటగా కనిపించింది. అటు తరువాత స్వామి దర్శనానంతరం ధ్వజ స్థంబానికి నమస్కరించుకునే సమయంలో దేవాన్ష్ ధ్వజ స్థంభం పీఠాన్ని తాకేందుకు ఆసక్తి చూపించాడు. ఈక్రమంలో అవ్వ భువనేశ్వరి తన మనవడిని చేతితో ఎత్తుకుని పీఠాన్ని తాకించి నమస్కరింపజేశారు.

చిత్రం..చంద్రబాబు దంపతులకు శ్రీవారి ప్రసాదం ఇస్తున్న టీటీడీ ఈవో సింఘాల్