ఆంధ్రప్రదేశ్‌

కన్నుల పండువగా ప్రభల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, జనవరి 16:సంక్రాంతి పర్వదినాల్లో ఏటేటా కనుమరోజు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల ఉత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. మొసలపల్లి పంచాయతీ పరిధిలోని కొబ్బరితోటలో ఏకాదశరుద్రులు కొలువుదీరి భక్తులను ఆనందపరవశులను చేశారు. సుమారు 400 వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రభల ఉత్సవానికి ఏంతో పేరుంది. 11 పరమేశ్వరుని రూపాలు ఒకేచోట కొలువుదీరి దర్శనమివ్వడంతో దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. గంగలకుర్రు శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ప్రభ, గంగలకుర్రు అగ్రహారం శ్రీ ఉమాపార్వతీ సమేత వీరేశ్వరస్వామివార్ల ప్రభలు అప్పర్‌కౌశికను దాటడం భక్తులకు కనువిందు చేసాయి. ఎంతో భారమైన ప్రభలు అర్చకునితో సహా భుజాలపై మోసుకుంటూ శివనామస్మరణతో కాలువను దాటారు. ఉత్సవస్థలిలో మొసలపల్లి, జి అగ్రహారం, గంగలకుర్రు ప్రభలతోపాటు పెదపూడి శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత ఆనందరామేశ్వరస్వామి, ఓంకారేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, వక్కలంక శ్రీ అన్నపూర్ణా సమేత విశే్వశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు భక్తులకు దర్శనమిచ్చాయి. తొలుత మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి వారు ఉత్సవ స్థలానికి చేరుకుని మిగిలిన ప్రభలకు స్వాగతం పలికారు. వాకలగరువు కోడిపందాలదిబ్బ వద్ద, చిరతపూడి గ్రామాల్లో ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించారు. తొండవరం శ్రీ ఉమా తొండేశ్వరస్వామి, వాకలగరువు శ్రీపార్వతీసమేత సోమేశ్వరస్వామి ప్రభలు సుమారు 47 అడుగులతో రాష్ట్రంలోనే ఎతె్తైనవిగా పేరుగాంచాయి. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం డిఎస్పీ ఎవిఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 150మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.

చిత్రం..అప్పర్ కౌశికను దాటుతున్న జి అగ్రహారం ప్రభ