ఆంధ్రప్రదేశ్‌

షరా‘మామూళ్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 16: రాష్ట్రంలో కోడి పందేలు సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మారిపోయాయి. సంక్రాంతిలో కోడి పందేలూ భాగమే. అవి లేని పండుగను చూడలేము. కానీ పందేలు జూదంగా మారితే.. వినోదం కాస్తా వ్యసనమైతే.. చట్టం కొరడా ఝుళిపించకమానదు. కోర్టులు సైతం రంగంలోకి దిగి అడ్డుకట్ట వేయాల్సిందే. అయితే న్యాయస్థానాల ఆదేశాలను సైతం లెక్కచేయని ధిక్కార ఘనులు మాత్రం తమ పంతం నెగ్గించుకున్నారు. విచ్చలవిడిగా జూదాలు నిర్వహించడం ద్వారా పలు జిల్లాల్లో కోడి పందేలు, రకరకాల జూదాలు విజయవంతంగా ముగిశాయి.
శ్రీకాకుళం, విజయనగరం మొదలు గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విజయవాడ సహా ఈ సంవత్సరం సంక్రాంతి కోడి పందేల జోరు ఆకాశాన్నంటింది. కోడి పందేల ఖరీదు ఈ ఏడాది సుమారు 500కోట్ల రూపాయలకు పైమాటేనని నిర్వాహకులు చెబుతున్నారు. కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఆసరా చేసుకున్న నిర్వాహకులు దాని మాటున జోరుగా పందేలు కానిచ్చేశారు. అయితే కోర్టు ఆదేశాలు పాటించారా అంటే అది వట్టిమాటే. ఏం జరిగితే అదే జరుగుతుంది అంటూ బహిరంగంగానే కత్తులు కట్టి మరీ ఆడించేశారు. అందుకు రాజకీయ నేతల అండదండలు లభించాయి. నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. రాష్టస్థ్రాయి పోలీసు ఉన్నతాధికారులే చేతులేత్తేయడంతో ఏ జిల్లాకాజిల్లా యంత్రాంగం గేట్లు బార్లా తెరిచేసింది. ప్రతిఫలంగా పందేలు నిర్వహించిన ప్రతి జిల్లాలోనూ స్టేషన్లవారీగా అందరికీ పెద్దమొత్తాల్లో నజరానాలు అందాయని ఆయాచోట్ల నిర్వాహకులు బహిరంగంగానే కూత పెడుతున్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలున్నా ఎప్పటిలాగే పోలీసులను నియంత్రించడంలో రాజకీయ నేతలు కృతకృత్యులయ్యారు. పైగా అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల కనుసన్నలోనే శిబిరాలు నడిచాయి. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పందిళ్లు వేసి రాత్రుల్లో సైతం యథేచ్ఛగా నడిపేందుకు పగటిని తలపించేలా ఫ్లడ్‌లైట్లు అమర్చి పందేలు సాగించారు. పాలకపక్షం చూసీచూడనట్లు వ్యవహరించాలని సూచించడం వల్లే కోడి జూదం ఇంతలా విజయవంతంగా ముగిసిందనడంలో అతిశయోక్తి లేదనే ఆరోపణలున్నాయి. ఆయా శిబిరాల్లోనే అశ్లీల నృత్యాలు, బెల్టుషాపులు, పలావు సెంటర్లు, పేకాట, లోపలా-బయట, కోతముక్క, మూడుముక్కలాట, గుండాట వంటి ఇతర జూదక్రీడల్లో సైతం కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే దగ్గరుండి మరీ నిర్వహించినా పట్టించుకునే సాహసం పోలీసులకు లేకుండాపోయింది. కృష్ణా జిల్లా, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాలు పెనమలూరు, ఉయ్యూరు, గన్నవరం, కొత్తూరు తాడేపల్లి, గుంటూరు జిల్లాలోని శివారు ప్రాంతాల్లో కోడి పందేల జూదం గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోనట్లు సాగింది. నిఘా విభాగం సైతం నిద్రలోకి జారేసి ‘మామూళ్ల’తో కొట్టిమరీ పందేలు నిర్వహించిన ఘనత రాజకీయ నేతలదే.